AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ సినిమా పెద్ద హిట్ అవుతుందనుకున్నా.. కానీ ఫ్లాప్ అయ్యింది: కృష్ణవంశీ

టాలీవుడ్‌లో తనదైన కథలు, విభిన్నమైన మేకింగ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు కృష్ణవంశీ. ఒకప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఆయన.. ప్రస్తుతం సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. చివరిగా ‘రంగమార్తాండ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన.. మరో కొత్త ప్రాజెక్ట్‌ను ఎప్పుడు ప్రకటిస్తారా.? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Rajeev Rayala
|

Updated on: Oct 12, 2026 | 1:36 PM

Share
టాలీవుడ్‌లో తనదైన కథలు, విభిన్నమైన మేకింగ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు కృష్ణవంశీ. ఒకప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఆయన.. ప్రస్తుతం సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. చివరిగా ‘రంగమార్తాండ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన.. మరో కొత్త ప్రాజెక్ట్‌ను ఎప్పుడు ప్రకటిస్తారా.? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో  ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృష్ణవంశీ తన కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఓ సినిమా ఫలితం తనను ఎంతగానో బాధించిందని వెల్లడించారు. దర్శకుడు కృష్ణవంశీ తన కెరీర్‌లో ఎన్నో విభిన్నమైన చిత్రాలను తెరకెక్కించారు. సామాజిక అంశాలను కథల్లో భాగం చేస్తూ ప్రేక్షకులను ఆలోచింపజేయడం ఆయన శైలి. అయితే కొన్ని సినిమాల విషయంలో ఆయన అంచనాలు తలకిందులయ్యాయి. అలా తాను ఎంతో కష్టపడి రూపొందించినప్పటికీ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిన చిత్రాల్లో జూనియర్ ఎన్టీఆర్ నటించిన రాఖీ కూడా ఒకటని ఆయన అన్నారు. 

1 / 5
మహిళలపై జరుగుతున్న దాడులు, వేధింపులు, సమాజంలో వారి పరిస్థితులను ప్రధానంగా తీసుకుని రూపొందించిన ఈ సినిమా అప్పట్లో ఓ ముఖ్యమైన సామాజిక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ఈ చిత్రం భారీ విజయాన్ని సాధిస్తుందని భావించినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేకపోవడం తనను బాధించిందని కృష్ణవంశీ చెప్పుకొచ్చారు. రాఖీ సినిమా కథ తన దగ్గరకు ఎలా వచ్చిందో కూడా కృష్ణవంశీ వివరించారు. రాధాకృష్ణ అనే వ్యక్తి చంద్రలేఖ, సింధూరం చిత్రాల సమయంలోనే ఈ కథను తనకు వినిపించారని తెలిపారు. అప్పట్లో తాను సొంత కథలతోనే సినిమాలు చేయాలని భావించేవాడినని, అయినప్పటికీ రాధాకృష్ణ పట్టుబట్టడంతో సుమారు నాలుగున్నర గంటల పాటు కథ విన్నానని గుర్తుచేసుకున్నారు.

2 / 5
ఆ కథలో మంచి విషయం ఉందని భావించినప్పటికీ, దాన్ని అప్పట్లో తెరకెక్కించలేదని చెప్పారు. అయితే జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా చేసే అవకాశం వచ్చినప్పుడు ఆయన ప్రతిభకు తగిన కథ కోసం ఆలోచించానని తెలిపారు. ఎన్టీఆర్‌లో అద్భుతమైన నటనతో పాటు డ్యాన్స్, డైలాగ్ డెలివరీ, వేగంగా విషయాలను గ్రహించే సామర్థ్యం ఉన్నాయని.. ఆయనకు సరిపోయే కథ కావాలని అనుకున్న సమయంలో ‘రాఖీ’ కథ గుర్తుకు వచ్చిందని వెల్లడించారు. రాధాకృష్ణ చెప్పిన కథను యథాతథంగా తెరకెక్కించలేదని కృష్ణవంశీ స్పష్టం చేశారు. కథలోని ప్రధాన భావాన్ని తీసుకుని, కొన్ని పాత్రలు, సన్నివేశాలను మాత్రమే ఉపయోగించుకున్నట్లు తెలిపారు. ఆ తర్వాత తన ఆలోచనలకు అనుగుణంగా స్క్రీన్‌ప్లేను పూర్తిగా పునర్నిర్మించి, పాటలు, ఫైట్స్‌తో పాటు కమర్షియల్ అంశాలను జోడించినట్లు చెప్పారు.

3 / 5
జూనియర్ ఎన్టీఆర్ నటన, ఎనర్జీకి తగినట్టుగా కథను తీర్చిదిద్దామని తెలిపారు . కథకు మూలం, ప్రధాన ఆలోచన రాధాకృష్ణదే అయినప్పటికీ.. తన అనుభవాలు, ఆలోచనలు, స్పందనలను జోడించి ఎన్టీఆర్‌కు సరిపోయేలా సినిమాను రూపొందించినట్లు పేర్కొన్నారు. ఈ కథను ఎన్టీఆర్‌కు చెప్పినప్పుడు ఆయన వెంటనే అంగీకరించారని కృష్ణవంశీ గుర్తుచేసుకున్నారు. కథ విన్న ఎన్టీఆర్.. బాగుందన్నయ్యా.. చేసేద్దాం అన్నారని తెలిపారు. దీంతో సినిమాను ఎంతో శ్రమించి తెరకెక్కించినట్లు చెప్పారు. సినిమాలోని భావోద్వేగాలు, సామాజిక సందేశం ప్రేక్షకులను బలంగా ఆకట్టుకుంటాయని ఆశించినప్పటికీ, విడుదల తర్వాత వచ్చిన ఫలితం తనను నిరాశపరిచిందని వెల్లడించారు.

4 / 5
 మహిళలపై జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తూ, వారికి అండగా నిలవాల్సిన అవసరాన్ని తెలియజేసే ప్రయత్నం చేసిన చిత్రం ‘రాఖీ’. ఇలాంటి సమస్యలు సమాజంలో చాలా కాలంగా కొనసాగుతున్నాయని, వాటిపై చర్చ జరగడం అవసరమని కృష్ణవంశీ అభిప్రాయపడ్డారు. తాను ఎంతో నమ్మకంతో, కష్టపడి రూపొందించిన సినిమా ఆశించిన విజయాన్ని అందుకోకపోవడం బాధ కలిగించిందని ఆయన వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం కృష్ణవంశీ కొత్త సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు.. ఆయన తదుపరి ప్రాజెక్ట్ ఎవరితో ఉండబోతుందనే విషయం ఆసక్తికరంగా మారింది. మరి ఆయన తన తదుపరి చిత్రంతో ఎలాంటి కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారో చూడాలి.

5 / 5
Follow Us
ఆ సినిమా పెద్ద హిట్ అవుతుందనుకున్నా.. కానీ ఫ్లాప్ అయ్యింది

చాలా రోజుల తర్వాత కనిపించిన రవితేజ కూతురు.. క్యూట్ ఫొటోస్ ఇదిగో

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. డిగ్రీ అర్హతతో రైల్వేశాఖలో ఉద్యోగాలు

బెంగళూరు ట్రాఫిక్.. ఈ నిజం తెలిస్తే IT ఉద్యోగుల దిమ్మతిరిగిపోద్ది

ఐపీఎల్ వేలంలోకి నయా విధ్వంసం ఎంట్రీ.. అన్ని రికార్డులు బద్దలే..!

క్యాండీ క్రష్‌లో బీహార్‌ యువకుడి ప్రపంచ రికార్డ్!

పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?

విమానంలో ఏయే వస్తువులను తీసుకెళ్లవచ్చు..? వీటికి నో ఎంట్రీ

ట్రాక్‌ మధ్యలో కంకరాళ్లు ఎందుకు వేస్తారో తెలుసా? వాటిని ఏమంటారంటే

నమ్మితే నట్టేట ముంచాడు.. అతని చేతిలో దారుణంగా మోసపోయిన శివారెడ్డి