
చాలా మంది సెలవులు దొరకగానే ఏదొక ప్రదేశానికి వెళ్తుంటారు. అయితే, ఈ సారి కాకినాడ వెళ్ళేందుకు ప్లాన్ చేసుకోండి. అక్కడ కృతి ప్రేమికులను మంచిగా ఎంజాయ్ చేయోచ్చు. మడ అడవులలో బోట్ షికార్ కూడా చేయోచ్చు.

కాకినాడ సమీపంలోని కోరంగి మడ అడవుల్లో స్పీడ్ బోట్ షికారు పర్యాటకుల ను ప్రకృతి ఒడిలోకి తీసుకెళ్లే అద్భుత అనుభూతిని అందిస్తోంది.గోదావరి డెల్టాలో విస్తరించిన ఈ మడ అడవులు జీవ వైవిధ్యానికి నిలయంగా నిలిచాయి.

స్పీడ్ బోట్‌లో ప్రయాణిస్తూ పచ్చని మడ చెట్లు, ప్రశాంతమైన నీటి కాలువలు,వివిధ రకాల పక్షులను దగ్గరగా వీక్షించే అవకాశం లభిస్తుంది. ఈ ప్రాంతం లో ఏర్పాటు చేసిన చెక్క వాక్‌వే,వాచ్ టవర్ కూడా సందర్శకుల ను విశేషంగా ఆకట్టుకుంటాయి.

ప్రకృతి ప్రేమికులు,ఫోటోగ్రఫీ అభిరుచి ఉన్నవారికి కోరంగి బోట్ షికారు ఒక మరపురాని అనుభవం గా నిలుస్తోంది. టూరిజం అధికారులు పర్యాటకులకు లైఫ్ జాకెట్లు ఇచ్చి ధైర్యంగా స్పీడ్ బోట్ లో బోట్ షికారి చేయండి అంటూ ఉత్సాహ పరుస్తున్నారు.

మీరు కాకినాడకు వెళ్తే ఈ బోట్ షికారు అస్సలు మిస్ అవ్వొద్దు ఇంకా కోరంగి మడ అడవుల అందాలు కూడా మీరు ఒక్కసారి వెళ్తే ఫిదా అవుతారు. ఇంకా స్పీడ్ బోట్‌లో వెళ్తున్నపుడు అడవులు పర్యాటకులను మంత్రముగ్ధులవ్వడం పక్కా