Number Plate Colours: వివిధ రంగుల్లో వాహనాల నెంబర్ ప్లేట్స్.. వాటి అర్థమేంటో మీకు తెలుసా?

|

Jul 27, 2022 | 8:21 AM

Number Plate Colours: చాలా కార్లకు తెలుపు, పసుపు రంగులో నంబర్ ప్లేట్‌లను కలిగి ఉండటం చూసే ఉంటారు. అయితే, వీటితో పాటు.. ఎరుపు, ఆకుపచ్చ, నీలం, నలుపు రంగుల్లోనూ ..

1 / 5
Number Plate Colours: చాలా కార్లకు తెలుపు, పసుపు రంగులో నంబర్ ప్లేట్‌లను కలిగి ఉండటం చూసే ఉంటారు. అయితే, వీటితో పాటు.. ఎరుపు, ఆకుపచ్చ, నీలం, నలుపు రంగుల్లోనూ నంబర్ ప్లేట్స్ ఉంటాయి. ఇవి అరుదుగా కనిపిస్తుంటాయి. వాస్తవానికి కారు నంబర్ ప్లేట్ దాని రిజిస్ట్రేషన్ ఆధారంగా నిర్ణయించబడుతుంది. ఇవాళ మనం ఎరుపు, ఆకుపచ్చ, బ్లూ, బ్లాక్ నంబర్ ప్లేట్స్‌కు అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

2 / 5
ఎరుపురంగు (రెడ్) నంబర్ ప్లేట్: గవర్నర్, రాష్ట్రపతి వాహనాలకు ఎరుపు రంగు నంబర్ ప్లేట్స్ ఉంటాయి. ఈ నంబర్ ప్లేట్‌లో జాతీయ చిహ్నం అశోక స్తంభాన్ని అమర్చుతారు. వారి కార్లకు నంబర్లు ఉండవు.

3 / 5
ఆకుపచ్చ(గ్రీన్) నంబర్ ప్లేట్: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు ఆకుపచ్చ నంబర్ ప్లేట్స్ కేటాయించడం జరిగింది. ఎలక్ట్రిక్ కార్లు, బైక్స్‌కు ఆకుపచ్చ నంబర్ ప్లేట్‌లపై తెలుపు రంగులో నంబర్లు రాస్తారు. ఇక వాణిజ్య ఎలక్ట్రిక్ వాహనాలకు పసుపు రంగులో నంబర్లు ఉంటాయి.

4 / 5
బ్లాక్ నంబర్ ప్లేట్: చాలా వాహనాల్లో బ్లాక్ నంబర్ ప్లేట్ చూసి ఉండవచ్చు. ఇవి కూడా వాణిజ్య వాహనాలే. అద్దెకు తీసుకునే కార్లను అద్దె కార్లు అని పిలుస్తారు. అందులోని నెంబర్లు పసుపు రంగులో రాస్తారు. రెంట్ కార్లకు బ్లాక్ కలర్ ప్లేట్లు ఉంటాయి.

5 / 5
బ్లూ నంబర్ ప్లేట్: ఎంబసీకి చెందిన వాహనాలకు మాత్రమే బ్లూ కలర్ నంబర్ ప్లేట్లు అతికిస్తారు. విదేశీ ప్రతినిధులు ఈ బ్లూ నంబర్ ప్లేట్ కార్లలో ప్రయాణిస్తారు. విదేశీ అంబాసిడర్లు, దౌత్యవేత్తల కార్లకు ఈ ప్లేట్స్ ఏర్పాటు చేస్తారు.