Coconut Oil: పోషకాలమయం కొబ్బరినూనె జుట్టుకే కాదు.. ఆరోగ్యానికి ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా?

Updated on: Apr 20, 2025 | 5:06 PM

కొబ్బరినూనెను సాధారణంగా జుట్టు సంరక్షణకు వినియోగిస్తుంటారు. ఇది జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది. కొబ్బరినూనెను తలపై రాస్తే జుట్టు మృదువుగా, ప్రకాశవంతంగా మారుతుంది. సహజంగా నిగారింపు చేకూరుతుంది. చుండ్రు తగ్గుతుంది. అలాగే జుట్టు చివరలు చిట్లిపోవడాన్ని కూడా నివారించవచ్చు. జుట్టుకు అవసరమైన పోషణను అందిస్తూ, జుట్టు మందంగా, బలంగా పెరగడంలో సహాయపడుతుంది. అయితే కొబ్బరినూనె కేవలం జుట్టు సంరక్షణకు మాత్రమే కాదు.. ఆరోగ్యపరంగా కూడా ఎన్నో ఉపయోగాలను అందిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

1 / 5
కొబ్బరి నూనె చర్మానికి సహజమైన తేమను అందిస్తుంది. మీరు రోజూ తినే ఆహారంలో ఒక టీ స్పూన్ కొబ్బరినూనెను చేర్చుకుంటే అనేక లాభాలను పొందవచ్చు. కొబ్బరినూనెలో యాంటీ ఆక్సిడెంట్లు, పాలిఫినాల్స్, విటమిన్ ఈ పుష్కలంగా ఉంటాయి. ఇందులో మీడియం చెయిన్ ఫ్యాటీ యాసిడ్లు కూడా ఉంటాయి. ఇవి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్ గుణాలతో చర్మంపై ఉండే సమస్యలను తగ్గిస్తాయి. కొబ్బరి నూనె వాడకంతో చర్మ సంబంధిత సమస్యలు దాదాపుగా అంతమవుతాయి.

2 / 5
Coconut Oil

Coconut Oil

3 / 5
ప్రతి రోజు రాత్రి నిద్రకు ముందు ఒక టీ స్పూన్ కొబ్బరినూనె తీసుకుంటే ఇది సహజ విరేచన చర్యగా పనిచేస్తుంది. తద్వారా సుఖ విరేచనమవుతుంది. జీర్ణాశయంలో ఉన్న వ్యర్థ పదార్థాలు, విషతత్వాలు బయటకు వెళ్లిపోతాయి. పెద్దపేగు శుభ్రంగా మారుతుంది. మలబద్ధక సమస్య తగ్గుతుంది. అలాగే కొబ్బరినూనె జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.

4 / 5
బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక వరంగా చెప్పవచ్చు. ఇందులో ఉండే మీడియం చెయిన్ ఫ్యాటీ యాసిడ్లు శరీర మెటాబాలిజాన్ని వేగవంతం చేస్తాయి. దీని వల్ల శరీరంలో అదనంగా నిల్వ ఉండే క్యాలరీలు ఖర్చవుతూ, కొవ్వు కరిగిపోతుంది. చర్మం నుంచి జీర్ణవ్యవస్థ దాకా, జుట్టు నుంచి గుండె ఆరోగ్య దాకా అన్ని దశల్లో ఇది అద్భుత ఫలితాలిచ్చే ఔషధ గుణాలు కలిగిన సహజ సంపదగా నిపుణులు చెబుతున్నారు.

5 / 5
కొబ్బరి నూనె వాడకంతో గ్యాస్, కడుపు ఉబ్బరం, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు దరిచేరవు. ఇందులో ఉండే అన్ శాచురేటెడ్ కొవ్వులు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయి. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.