
బెల్లంలో ఉండే గ్లైకాలిక్ యాసిడ్ మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. గ్రాన్యుయల్స్ చర్మం మీద డెడ్ సెల్స్ ని తొలగిస్తుంది. చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. ఇది ముఖంపై నల్ల మచ్చలు, మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది.

బెల్లం ముఖంపై ముడతలు, గీతలు, దురద వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఒక చెంచా బెల్లం తీసుకుని అందులో ఒక చెంచా తేనె, నిమ్మరసం కలిపి పేస్ట్ లా చేసి ముఖానికి రాసుకుని మర్దన చేసి ఐదు నిమిషాలు అలాగే ఉంచి కడిగేస్తే ముఖం మెరిసిపోతుంది. చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.

బెల్లంలోని యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్, జింక్, సెలీనియమ్ ముఖంపై ముడతలు రానివ్వకుండా చేస్తుంది. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ మొటిమలు రాకుండా చేస్తుంది. చర్మంపై బ్యాక్టీరియాను తొలగిస్తుంది.

రోజు బెల్లం తింటే.. బ్లడ్ సర్క్యులేషన్ పెరగుతుంది. దీంతో సెల్ టర్నోవర్ ఎక్కువ అవుతుంది. స్కిన్ బ్రైట్ అవుతుంది.బెల్లంలో ఉండే పోషకాల వల్ల ఎండలోకి వెళ్లినప్పుడు స్కిన్ పాడవ్వదు. అంతేకాదు, ఇందులో ఉండే మినరల్స్, విటమిన్స్ వల్ల దెబ్బ తగిలితే తొందరగా మానేలా చేస్తుంది.

బెల్లంతో ఫేస్ ప్యాక్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ముందుగా ఒక చెంచా బెల్లం తీసుకుని అందులో చెంచా సెనగపిండి, ఒక చెంచా పాలు కలిపి మెత్తటి పేస్టును సిద్ధం చేసుకోవాలి. ఆ పేస్ట్ ని ముఖానికి పట్టించి, కనీసం 20 నిమిషాల పాటు ముఖాన్ని ఆరనివ్వాలి. ఆ తరువాత శుభ్రమైన నీటితో వాష్ చేసుకోవాలి. క్రమం తప్పకుండా ఇలా చేస్తూ ఉంటే..మీ ముఖం లో కొత్త మెరుపు వచ్చినట్లు కనిపిస్తుంది.