బోడ కాకరకాయకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. ఏడాదిలో కేవలం నెల నెలన్నర రోజులు మాత్రమే ఇది మార్కెట్‌కు వస్తుంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ సీజనల్ కూరగాయ బోడకాకరకాయను కనీసం ఒక్కసారైనా తినాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అన్ని మార్కెట్లలో బోడ కాకర విక్రయానికి వస్తుంది. కిలో రూ.380 నుంచి రూ.400 వరకు ధర పలుకుతోంది. రసాయనాలు లేకుండా పండే ఈ బోడ కాకర ధర చికెన్ కంటే కూడా ఎక్కువే అయినప్పటికీ, ప్రజలు దీన్ని కొనడానికి ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే..
Boda Kakarakaya
Follow us on
బోడ కాకర కాయతో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. కేవలం వర్షా కాలంలో మాత్రమే విరివిగా లభించే ఈ బోడ కాకర కాయ కూర వండుకుని తింటే ఆరోగ్యానికి కలిగే లాభాలు అన్నీ ఇన్నీ కావు. బోడకాకరకాయలో విటమిన్లు ఏ, సీ, కే సమృద్ధిగా ఉంటాయి.
మలబద్ధకం, ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది. బ్లడ్‌ప్రెషర్ కంట్రోల్లో ఉంచుతుంది. ముఖంపై మొటిమలు, తామర వంటి చర్మ సమస్యలకు ఉపయోగపడుతుంది. బరువు తగ్గాలనుకునేవారు బోడకాకరకాయలను ఆహారంలో చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది. బోడకాకరకాయ ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గు నుంచి రక్షణ కల్పిస్తుంది. తలనొప్పి, చెవి నొప్పి వంటి సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి.
డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు బోడ కాకరకాయ మంచి ఎంపిక. దీనిలోని ఫైబర్‌తో పాటు అధిక నీటి శాతం షుగర్ పేషెంట్లకు మేలు చేస్తుంది. బోడ కాకరకాయలో మంచి మొత్తంలో మొక్కల ఇన్సులిన్ ఉంటుంది. అందుకని డయాబెటిక్ రోగులకు ఇది సరైన ఎంపికగా పరిగణిస్తారు.
శరీరంలో క్యాన్సర్ కలిగించే ఫ్రీ రాడికల్స్ ను తొలగించడానికి బోడ కాకరకాయ అద్భుతంగా పనిచేస్తుంది. ఇది విటమిన్ సి , సహజ యాంటీ-ఆక్సిడెంట్స్ కు గొప్ప మూలం. శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ ను తొలగించి క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. బీటా కెరోటిన్, లుటీన్, జాంక్సెథిన్ వంటి ఫ్లేవోనైట్ వంటి పోషకాలు బోడ కాకరకాయలో పుష్కలంగా ఉంటాయి. ఈ మూలకాలన్నీ చర్మానికి చాలా మేలు చేస్తాయి. వృద్ధాప్యాన్ని నివారిస్తాయి.
బోడ కాకరకాయలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే దీనిలో ఫైటోన్యూట్రియెంట్లు అనే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి అనేక వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. 100 గ్రాముల బోడ కాకరకాయలో 17 గ్రాముల కేలరీలు మాత్రమే ఉంటాయి. అందువల్ల ఇది బరువు తగ్గడంతో కూడా తోడ్పడుతుంది.