క్యారెట్, బీన్స్, దుంపలు, బఠానీలు, క్యాప్సికమ్ సన్నగా తరిగి పెట్టుకోవాలి. మిరపకాయ, ఉల్లిపాయ, అల్లం ముక్కలు, అరకప్పు దంచిన కొబ్బరిని సిద్దం చేసుకోవాలి. ఇప్పుడు బాణనీలో ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయ, ఎండుమిర్చి, అల్లం వేయాలి. ఇప్పుడు అందులో తరిగిన కూరగాయల ముక్కలు, ఓట్ వేసి కలపాలి. రుచికి ఉప్పు, చక్కెర, నల్ల మిరియాలు జోడించాలి. ఇప్పుడు కొబ్బరి పొడిని కలిపి, 1 కప్పు నీరు అందులో పొయ్యాలి. కొంచెం సమయం ఉడికించాక దించెయ్యాలి.