
వర్క్ అవుట్స్ చేసే సమయంలో కొన్నిసార్లు గాయాలు అవుతుంటాయి. ఇంకా కండరాలు పట్టుకుపోవచ్చు. మరికొన్ని సందర్భాలలో మీరు అలసిపోయి కింద పడిపోవచ్చు లేదా కార్డియాక్ అరెస్ట్ వంటి ప్రాణాంతక పరిస్థితి ఏర్పడవచ్చు. అలాంటి సందర్భాలు ఎదురవకుండా ఈ జాగ్రత్తలను పాటించండి..

నిరంతరంగా వ్యాయామాలు చేయడం కూడా మంచిది కాదు. మీ సామర్థ్యానికి మించి వ్యాయామాలు చేయడం చాలా ప్రమాదకరం.

కండరాలు పట్టుకోకుండా ఉండాలంటే వ్యాయామానికి ముందు కనీసం 10-12 నిమిషాలు వార్మప్ చేయాలి. తద్వారా కండరాలలో వేడి పుడుతుంది, ఇంకా అవి నొప్పికి అలవాటుపడతాయి.

ప్రతిరోజూ ఒకే విధమైన ఫిట్‌నెస్ చేయడం మానుకోండి. ఒకరోజు సైక్లింగ్ చేసినట్లయితే, మరుసటి రోజు మరొక రకమైన వ్యాయమం చేయాలి.

ఖాళీ కడుపుతో ఎప్పుడూ వ్యాయామం చేయకండి. అది మీ శరీరాన్ని బలహీనపరుస్తుంది ఇంకా మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేస్తుంది.

మీరు వ్యాయామం చేయాలంటే మీ శరీరానికి శక్తి అవసరం. కాబట్టి వర్క్ అవుట్స్ ప్రారంభించేందుకు కనీసం పదిహేను నిమిషాల ముందు పండ్లు తినండి.

వారానికి ఒకసారి మీ శరీరానికి వ్యాయామం నుంచి విశ్రాంతి ఇవ్వండి.