
బీరకాయలో వాటర్, ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. బీరకాయలో కొవ్వులు తక్కువగా ఉంటాయి. బీరకాయలో విటమిన్ ఏ, సీ, ఐరన్, మెగ్నీషియం, విటమిన్ బి6, పొటాషియం, సోడియం లభిస్తాయి. బీరకాయంలో ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. బీరకాయలోని విటమిన్ బి6 ఐరన్‌తో పాటు శరీరంలోని ఎర్ర రక్తకణాల సంశ్లేషణలో పాల్గొంటాయి. దీంతో రక్తహీనత దరి ఉండదు.

బీరకాయలో వాటర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. బీరకాయలో సెల్యులోజ్, డైటర్ ఫైబర్ కూడా లభిస్తుంది. బీరకాయను తినడంతో జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా మారుతుంది. మలబద్దకం దూరం అవుతుంది. శరీరంలోని టాక్సిన్లను బయిటకు పంపించడంలో బీరకాయ సహాయపడుతుంది. ఇది రక్తాన్ని శుద్ది చేస్తుంది. కాలేయాన్ని ఆరోగ్యంగా మార్చడంలో సహాయపడుతుంది.

బీరకాయలో విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం పోషకాలు లభిస్తాయి. ఇవి రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. బీరకాయ తినడంతో చిన్న చిన్న ఇన్ఫెక్షన్ల నుంచి దూరంగా ఉండవచ్చు. బీరకాయలో పొటాషియం, మెగ్నీషియం మెండుగా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యవంతంగా మార్చుతాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో బీరకాయ సహాయపడుతుంది. దీంతో అకస్మాత్తుగా గుండెపోటు రాదు.

బీరకాయ వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. ఇందులోని పొటాషియం, సోడియం, జింక్, రాగి, సెలీనియం శరీరంలోని యాసిడ్స్‌ను తటస్తం చేస్తాయి. అల్సర్లను నివారించడంలో బీరకాయలు సమర్థవంతంగా పని చేస్తుంది. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, కూలింగ్ ఏజెంట్లు ఉంటాయి. ఇవి శరీరాన్ని కూల్ చేస్తాయి.

బిరకాయలో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే బీరకాయలో జింక్, ఐరన్, పొటాషియం విటమిన్లతో పాటు ఎన్నో ఖనిజాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను మరింత మెరుగుపరుస్తాయి. బీరకాయ రక్తంలోని చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది. మూత్రంలోని చక్కెర స్థాయిలను సైతం తగ్గించేందుకు సహాయపడుతుంది.