
మురికి పాత్రలు: చాలామంది రాత్రి పూట భోజనం చేసిన తర్వాత పాత్రలను కడగకుండా సింక్‌లోనే వదిలేసి, ఉదయాన్నే శుభ్రం చేస్తుంటారు. వాస్తు ప్రకారం ఇది అత్యంత ప్రమాదకరం. రాత్రంతా ఉండే మురికి పాత్రలు ప్రతికూల శక్తిని పెంచుతాయి. ఇది లక్ష్మీదేవి రాకను అడ్డుకోవడమే కాకుండా, ఇంట్లో అనవసర ఖర్చులను పెంచుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.

అగ్ని - నీరు: వంటగదిలో స్టవ్, సింక్ లేదా వాటర్ ట్యాప్ ఒకదానికొకటి చాలా దగ్గరగా లేదా ఒకే వరుసలో ఉండకూడదు. అగ్ని, నీరు విరుద్ధ అంశాలు కావడం వల్ల ఇవి దగ్గరగా ఉంటే దంపతుల మధ్య గొడవలు, అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

మందులు-విరిగిన పాత్రలు: వంటగదిని కేవలం ఆహారానికి మాత్రమే పరిమితం చేయాలి. వంటగదిలో మెడికల్ కిట్‌లు లేదా మందులు ఉంచడం అశుభం. ఇది ఇంట్లోని వారు తరచూ అనారోగ్యం పాలయ్యేలా చేస్తుంది. పగిలిన పాత్రలు ఆర్థిక నష్టానికి, పేదరికానికి సంకేతం. వాటిని వెంటనే తొలగించాలి. స్టవ్ పైన లేదా వంటగదిలో అద్దం, దేవతల ఫోటోలు ఉంచడం వాస్తు విరుద్ధం.

శుభప్రదమైన దిశలు: వంట చేసేటప్పుడు ఎల్లప్పుడూ తూర్పు వైపు ముఖం ఉంచడం శ్రేయస్కరం. దక్షిణం వైపు తిరిగి వంట చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. వాస్తు ప్రకారం వంటగది ఆగ్నేయ మూలలో ఉండటం అత్యంత శుభప్రదం. వంటగదిలోకి చెప్పులు ధరించి రావడం వల్ల ఆహార స్వచ్ఛత దెబ్బతింటుంది.

వంటగదిని ఎల్లప్పుడూ శుభ్రంగా, గాలి వెలుతురు వచ్చేలా ఉంచుకోవాలి. ప్రతిరోజూ సాయంత్రం వంటగదిలో ఒక చిన్న దీపం లేదా వెలుగు ఉండేలా చూసుకోవడం వల్ల ఇంట్లో సిరిసంపదలు వృద్ధి చెందుతాయని వాస్తు పండితులు సూచిస్తున్నారు.