Kitchen Tips: పిజ్జా నుండి ఫ్రెంచ్ ఫ్రైస్ వరకు ప్రతిదీ ఎయిర్ ఫ్రైయర్‌లో తయారు చేస్తున్నారా? అయితే మీ కోసమే ఇది
ఎయిర్ ఫ్రైయర్ ప్రస్తుతం ప్రతి వంట గదిలో ఉన్న ఒక ఎలక్ట్రానిక్ వస్తువు. ఇందులో ఈజీగా వంటలను చేస్తుంటారు. అంతేకాదు తక్కువ నూనెతో టేస్టీగా ఎయిర్ ఫ్రైయర్‌తో వంటలను క్షణాల్లో రెడీ చేస్తున్నారు. మ్యారినేట్ చేసిన చేపలు, మాంసాన్ని నూనెతో బ్రష్ చేసిన తర్వాత ఎయిర్ ఫ్రైయర్ తో రెడీ చేస్తున్నారు. అయితే ఎయిర్ ఫ్రయ్యర్‌లో వండకూడని ఆహారాలు కూడా ఉన్నాయి. అవి ఏమిటో తెలుసుకుందాం..