రుచి కరమైన బిర్యానీ ఓ వైపు, నెయ్యి ఓ వైపు ఉంచితే ఖచ్చితంగా మీ ఎంపిక నెయ్యి అవుతుంది. ముఖ్యంగా శాఖాహారులు నెయ్యిని ఎంతో ఇష్టంగా తింటారు. వేడి వేడి అన్నంలో ముద్దపప్పు- నెయ్యి లేదా ఆవకాయ-నెయ్యి కాంబినేషన్ ఏదైనా లొట్టలేసుకుతింటారు భోజన ప్రియులు.
హిందూ పురాణాలు నెయ్యి చాలా పవిత్రమైనదిగా పేర్కొంటాయి. ఆహారంలోనేకాకుండా దీపాలు కూడా వెలిగిస్తారు. స్వచ్ఛమైన నెయ్యితో ప్రసాదం తయారు చేసి భక్తి శ్రద్ధలతో ఇష్టదైవానికి నైవేద్యం సమర్పించే ఆచారం మన దేశంలో అనాదిగా పాటిస్తున్నారు.
ఆరోగ్యంగా ఉండాలంటే నెయ్యి తినాలని పోషకాహార నిపుణులు సైతం సూచిస్తుంటారు. ఐతే మీరు తినే నెయ్యి స్వచ్ఛమైనదేనా? ఈ సందేహం ఎప్పుడైనా తలెత్తిందా? కల్తీ నెయ్యి తింటే లివర్ దెబ్బతింటుంది.
గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు వెంటాడుతాయి. కల్తీ నెయ్యికి, స్వచ్ఛమైన నెయ్యికి తేడా ఏమిటి? నెయ్యి ప్యూరిటీని ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే..
అరచేతిపై ఒక స్పూన్ నెయ్యి వేయండి. అది మామూలుగా కరగడం ప్రారంభిస్తే నెయ్యి స్వచ్ఛమైనదని అర్థం.
ఫ్రిజ్‌లో పెట్టిన నెయ్యి గట్టిపడితే అది కల్తీ లేనిదని అర్థం.
కల్తీ నెయ్యి ఎప్పటికీ గడ్డకట్టదు. అంటే ఎప్పుడూ ద్రవంగానే ఉంటుంది. స్వచ్ఛమైన నెయ్యి అలాకాదు. వేడి చేసిన కాసేపటికే మళ్లీ గడ్డకట్టడం ప్రారంభమవుతుంది.