- Telugu News Photo Gallery Kitchen And Dish Washing Tips: Using Lemon Peels To Make DIY Cleanser Is Unbelievably Easy And Effective
Kitchen Cleaning Tips: గ్యాస్ స్టౌపై మొండి మరకలు వదలట్లేదా? అయితే ఈ క్లీనింగ్ స్ప్రేతో చిటికెలో శుభ్రం చేసేయండి..
వంటగదిని శుభ్రం చేయడం గృహిణులకు పెద్ద సమస్యగా మారుతుంది. కిచెన్‌లో ఆయిల్ జిడ్డు, గోడలు, గ్యాస్ బర్నర్లపై కాలిన మచ్చలు శుభ్రం చేయడానికి చాలా శ్రమ పడిపోతుంటారు. స్టీల్ గిన్నెలపై పసుపు మరకలు సబ్బుతో ఎంత తోమినా శుభ్రం కావు. వంటగది శుభ్రం చేయడానికి నిమ్మకాయ సహాయపడుతుంది. నిమ్మరసంలోని అసిడిక్ కంటెంట్ మొండి మచ్చలను క్షణాల్లో తొలగిస్తుంది. నూనె మరకలను కూడా వదిలించి, సువాసనలు వెదజల్లుతుంది..
Updated on: Nov 06, 2023 | 7:59 PM

వంటగదిని శుభ్రం చేయడం గృహిణులకు పెద్ద సమస్యగా మారుతుంది. కిచెన్‌లో ఆయిల్ జిడ్డు, గోడలు, గ్యాస్ బర్నర్లపై కాలిన మచ్చలు శుభ్రం చేయడానికి చాలా శ్రమ పడిపోతుంటారు. స్టీల్ గిన్నెలపై పసుపు మరకలు సబ్బుతో ఎంత తోమినా శుభ్రం కావు.

వంటగది శుభ్రం చేయడానికి నిమ్మకాయ సహాయపడుతుంది. నిమ్మరసంలోని అసిడిక్ కంటెంట్ మొండి మచ్చలను క్షణాల్లో తొలగిస్తుంది. నూనె మరకలను కూడా వదిలించి, సువాసనలు వెదజల్లుతుంది.

లిక్విడ్ డిష్ సోప్‌లో నిమ్మరసం కలపుకుని పాత్రలను శుభ్రం చేయవచ్చు. లేదంటే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని అందులో వంట పాత్రలను ముంచండి. తర్వాత స్పాంజితో గట్టిగా రుద్దితే శుభ్రంగా ఉంటుంది.

వంటగదిని శుభ్రం చేయడానికి మీరు నిమ్మకాయ క్లీనింగ్ స్ప్రేని తయారు చేయవచ్చు. నిమ్మకాయను తొక్కండి. నిమ్మకాయను రసం తీసి ఖాళీ స్ప్రే బాటిల్‌లో నింపుకోవాలి. దానికి 1/2 కప్పు వైట్ వెనిగర్ జోడించాలి. చివరిగా ఈ స్ప్రే బాటిల్‌లో 1 చెంచా ఉప్పు, 2 చెంచాల డిష్ వాషింగ్ లిక్విడ్ సోప్ కలపండి. కొద్దిగా నీళ్లు కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు స్ప్రే బాటిల్‌ని గట్టిగా షేక్ చేస్తే నిమ్మ క్లీనింగ్ స్ప్రే సిద్ధం అయినట్లే.

ఈ లెమన్ క్లీనింగ్ స్ప్రేతో వంటగదిలోని అన్ని పాత్రలను శుభ్రం చేసుకోవచ్చు. ఇది నూనె మరకలు, వాసనలు అన్నింటిని తొలగిస్తుంది. గ్యాస్ స్టవ్‌పై మరకలు కూడా సులువుగా వదిలిపోతాయి.





























