
సౌత్ ఇండియన్ నటి కీర్తి సురేష్ ఆభిమానులు ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను క్రమం తప్పకుండా ఫాలో అవుతుంటారు. ఐతే తాజాగా ఈ గ్లామరస్ బ్యూటీ చేసిన ఓ పనికి తెగ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.

ఆమె వేసుకున్న డ్రెస్ ఫ్యాన్స్‌కు అస్సలు నచ్చలేదట.

లైట్ గ్రీన్ కలర్ ఓవర్‌సైజ్ సూట్ ధరించింది. ఈ డ్రస్‌పై భారీ నగలు ధరించి దిగిన కొన్ని ఫోటోలను కీర్తి సురుష్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

కీర్తి ఫ్యాషన్ సెన్స్‌కి 'వరస్ట్ ఫ్యాషన్ సెన్స్ ఆఫ్ ది డే' అనే క్యాప్షన్‌తో తెగ ట్రోల్ చేస్తున్నారు.

'ఇలాంటి ఫ్యాషన్ దుస్తులు నీకు అస్సలు నొప్పవు. ఇండియన్ ఫ్యాషన్‌లోనే నువ్వు అందంగా కనిపిస్తావ్', 'ఓవర్ సైజ్ డ్రెస్, డ్రెస్ కలర్ రెండూ నీకు అస్సలు సూటు కాలేదు'. నీ మేకప్.. నువ్వు ధరించిన దుస్తులు, జ్యువెల్లరీకి అస్సలు మ్యాచ్ అవ్వలేదు'.