
పుదీనా ఎక్కువ రోజులు ఫ్రష్‌గా ఉండాలంటే దాన్ని ఎలా నిల్వ చేస్తున్నామనేది చాలా ముఖ్యం. ఎందుకంటే అందులో కొద్దిగ తేమ ఉన్నా అది త్వరగా మురిగిపోతుంది. కాబట్టి మీరు మార్కెట్ నుంచి తెచ్చిన పుదీనాను శుభ్రంగా కడిగిన తర్వాత ఒక శుభ్రమైన కిచెన్ టవల్ లేదా పేపర్ టవల్‌పై ఆకులను పరచి ఆరనివ్వండి. ఆకులకు ఉన్న తేమ పూర్తిగా పోనివ్వండి.. లేదంటే వాటిని స్టోర్ చేసినప్పుడు అవి నల్లగా మారే అవకాశం ఉంది.

పుదీన ఎక్కువ రోజులు ప్రెష్‌గా ఉండాలంటే నీళ్ల జార్‌లో నిల్వ చేయడం కూడా మంచి పద్ధతి. ఇందుకోసం పుదీనా కాడల చివర్లను కొద్దిగా కత్తిరించి.. ఒక గ్లాసు లేదా గాజు సీసాలో అంగుళం మేర నీళ్లు పోసి, పుదీనా కట్టను అందులో నిలువుగా ఉంచండి. ఆకులపై ఒక ప్లాస్టిక్ కవర్‌ను వదులుగా కప్పి, ఆ సీసాను ఫ్రిజ్‌లో ఉంచండి. ప్రతి రెండు నుంచి మూడు రోజులకు ఒకసారి నీటిని మారుస్తూ ఉంటే, పుదీనా ఒకటి నుంచి రెండు వారాల పాటు తాజాగా ఉంటుంది.

తడి పేపర్ టవల్‌ను చుట్టడం ద్వారా కూడా మీరు పుదీనాను ఎక్కవ రోజులు నిల్వ చేయవచ్చు. ఇందుకోసం ఒక పేపర్ టవల్‌పై ఆకులను పరచి, వదులుగా చుట్టండి. ఆ రోల్‌ను ఒక డబ్బాలో లేదా జిప్‌లాక్ బ్యాగ్‌లో ఉంచి, గాలి తగిలేలా కాస్త తెరిచి ఉంచండి. పేపర్ టవల్ మరీ తడిగా మారితే దాన్ని తీసేసి కొత్తది పెట్టండి.ఇలా నిల్వ చేస్తే పుదీనా వారం నుంచి 10 రోజుల వరకు ఫ్రెష్‌గా ఉంటుంది.

మీరు ఎక్కువ కాలం ఫ్రిజ్‌లో ఉంచాలి అనుకుంటే.. మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే పుదీనాను కడిగి, పూర్తిగా ఆరబెట్టిన తర్వాత చిన్నగా తరగండి. వాటిని ఐస్ ట్రేలోని వేసి, నీళ్లు పోసి గడ్డకట్టించండి. తర్వాత ఆ ఐస్ క్యూబ్స్‌ను ఒక జిప్‌లాక్ బ్యాగ్‌లోకి మార్చి డీ ఫ్రీజ్‌లో ఉంచండి. ఈ ఐస్ క్యూబ్స్ 3 నుంచి 6 నెలల వరకు నిల్వ ఉంటాయి. వీటిని నేరుగా కూరలు, పప్పు, టీలలో వాడుకోవచ్చు. అలా కాకుండా మీరు నేరుగా ఆకులనే నిల్వ చేయాలనుకుంటే, ఒక ప్లేట్‌లో విడివిడిగా పెట్టి గడ్డకట్టించాక బ్యాగ్‌లో వేయండి.ఇలా చేస్తే ఆకులు ఒకదానికొకటి అంటుకోవు.

పైన పేర్కొన్న మూడు పద్దతుల్లోనూ మీరు పుదీనాను ఎక్కవ రోజులు తాజాగా ఉంచవచ్చు. అయితే వీటిలో బెస్ట్ ఏదనే విషయానికి వస్తే కాడలతో సహా కొద్ది రోజులు ఉంచాలంటే నీళ్ల జార్ పద్ధతి మంచిది, అలా కాదని ఆకులు మాత్రమే ఉంటే తడి పేపర్ టవల్ పద్ధతిని మంచిది, ఇంకా మీరు నెలల తరబడి పుదీనాను ఫ్రెష్‌గా ఉంచాలంటే ఐస్ క్యూబ్ ట్రేలలో పెట్టి ఫ్రీజ్ చేయడమే సరైన మార్గం.