కాణిపాకం వినాయకుడి బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు.. 21 రోజుల పాటు గణనాథుడి వైభవం!

Edited By:

Updated on: Sep 13, 2026 | 8:14 AM

స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయకుడి సన్నిధి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. వినాయక చవితి కి విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా వెలిగి పోతోంది. రారండోయ్ వేడుక చూద్దాం అంటూ వినాయక చవితి సంబరంతో సందడి ప్రారంభం కానుంది. 21 రోజుల పాటు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలకు గణనాథుడి ఆలయం ఏర్పాట్లతో సిద్ధంగా ఉంది.

1 / 5

2 / 5
సత్య ప్రమాణాల సన్నిధి చిత్తూరు జిల్లా కాణిపాకం ఆలయం వినాయక చవితి వేడుకలతో అంగరంగ వైభవంగా ఆకట్టు కుంటుంది. వినాయక చవితి ఉత్సవాలతో ప్రారంభమయ్యే గణనాథుడి బ్రహ్మోత్సవాలు 21 రోజులు పాటు జరగ నుండగా ఈ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు వినాయక చవితి ఈ నెల 15న  గణనాథుడి బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణం జరగ నుంది. ఈ నెల 14 వినాయక చవితి నుంచి  వార్షిక బ్రహ్మోత్సవ సంబరాలు జరగనుండగా నవరాత్రి ఉత్సవాలు ఈనెల 23 న జరిగే తెప్పోత్సవంతో ముగియ
నున్నాయి.

సత్య ప్రమాణాల సన్నిధి చిత్తూరు జిల్లా కాణిపాకం ఆలయం వినాయక చవితి వేడుకలతో అంగరంగ వైభవంగా ఆకట్టు కుంటుంది. వినాయక చవితి ఉత్సవాలతో ప్రారంభమయ్యే గణనాథుడి బ్రహ్మోత్సవాలు 21 రోజులు పాటు జరగ నుండగా ఈ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు వినాయక చవితి ఈ నెల 15న గణనాథుడి బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణం జరగ నుంది. ఈ నెల 14 వినాయక చవితి నుంచి వార్షిక బ్రహ్మోత్సవ సంబరాలు జరగనుండగా నవరాత్రి ఉత్సవాలు ఈనెల 23 న జరిగే తెప్పోత్సవంతో ముగియ నున్నాయి.

3 / 5

ఇక సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 4 వరకు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తున్న దేవస్థానం ఈ మేరకు విస్తృత ఏర్పాట్లు చేసింది. స్వయంభు వరసిద్ధి వినాయకుడి సన్నిధిని విద్యుత్ దీప అలంకరణలు ఫల పుష్పాలతో  అలంకరించింది. విజ్ఞాలకు అధిపతి అయిన గణనాథుడి దర్శనం కోసం వచ్చే భక్తులకు విస్తృత ఏర్పాట్లు చేసింది. దేశంలో ఎక్కడా లేని రీతిలో 21 రోజులపాటు కాణిపాకం ఆలయంలోనే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నా యంటున్న ఆలయ అర్చకులు చవితి రోజు గణనాథుడి వ్రతం, కళ్యాణం నిర్వహించనున్నారు. ఇక భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూ లైన్లను ఏర్పాటు చేసిన ఆలయ యంత్రాంగం వినాయక చవితి రోజు అర్ధరాత్రి 2  గంటలకు ఉభయదారులు నిర్వహించే అభిషేకం,  అనంతరం 3 గంటల నుంచి భక్తులకు స్వామి వారి సర్వదర్శనం కల్పించనుంది. వినాయక చవితి నుంచి వచ్చే అక్టోబర్ 4 వరకు ఆర్జిత సేవలను రద్దు చేసింది.

4 / 5
బ్రహ్మోత్సవాలను విజయ వంతం చేసేందుకు ఇప్పటికే చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే అన్ని శాఖల అధికారులతో కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించగా వికలాంగులు,  వయో వృద్దులు, చంటి బిడ్డల తల్లులకు ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేసారు. కాణిపాకం ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలను కూడా  అలంకరించిన దేవస్థానం గణపతి హోమం యధావిధిగా నిర్వహించనుంది. వినాయక చవితి రోజున చందనం అలంకరణతో దర్శనం ఇవ్వనున్న వినాయకుడికి గణేష్ మాల ధరించిన భక్తులు పెద్ద సంఖ్యలో మొక్కులు చెల్లించుకోనున్నారు. ఇక అదే రోజు పుష్పకావిడి సమర్పించనుండగా రాత్రి కాణిపాకం ఆలయ వీధుల్లో సిద్ధి బుద్ధి సమేత గణనాథుడు దర్శనం ఇవ్వనున్నారు. ఈ నెల 15న ధ్వజారోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండగా రాత్రి హంస వాహనంపై గణనాథుడు దర్శనం ఇవ్వనున్నారు.

5 / 5
ఇక వినాయకుడి బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వినాయక చవితి రోజు ఉదయం 10 గంటలకు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించ నున్నారు. వినాయక చవితి రోజున దాదాపు లక్ష మందికి పైగానే భక్తులు వస్తారన్న అంచనాతో ఏర్పాట్లు చేసిన దేవాదాయ శాఖ బ్రహ్మోత్సవాల నిర్వహణకు ప్రత్యేక బడ్జెట్ ను కూడా కేటాయించింది. విద్యుత్ దీప అలంకరణలతో పాటు భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేసిన దేవస్థానం సామాన్య భక్తులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామంటోంది.
ఇక అధికార యంత్రాంగం సరదర్శనం భక్తుల క్యూ లైన్లు, స్వామి వారి ప్రసాదాలు, అల్పాహారం సరఫరాపై  ప్రత్యేక దృష్టి పెట్టింది. దాదాపు లక్షకు పైగా లడ్డూలను బఫర్ స్టాక్ గా  సిద్ధం చేసిన దేవస్థానం భద్రత కు పెద్ద పీట వేసింది. ఆలయ పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షించనుంది. 500 మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేయనుంది.

ఇక వినాయకుడి బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వినాయక చవితి రోజు ఉదయం 10 గంటలకు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించ నున్నారు. వినాయక చవితి రోజున దాదాపు లక్ష మందికి పైగానే భక్తులు వస్తారన్న అంచనాతో ఏర్పాట్లు చేసిన దేవాదాయ శాఖ బ్రహ్మోత్సవాల నిర్వహణకు ప్రత్యేక బడ్జెట్ ను కూడా కేటాయించింది. విద్యుత్ దీప అలంకరణలతో పాటు భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేసిన దేవస్థానం సామాన్య భక్తులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామంటోంది. ఇక అధికార యంత్రాంగం సరదర్శనం భక్తుల క్యూ లైన్లు, స్వామి వారి ప్రసాదాలు, అల్పాహారం సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టింది. దాదాపు లక్షకు పైగా లడ్డూలను బఫర్ స్టాక్ గా సిద్ధం చేసిన దేవస్థానం భద్రత కు పెద్ద పీట వేసింది. ఆలయ పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షించనుంది. 500 మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేయనుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us