
కావాల్సిన పదార్ధాలు : పావు కిలో కోడి కందనకాయలు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అర టీ స్పూన్ పసుపు, నూనె, రెండు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ కారం, ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీరను తీసుకోవాలి.

కందనకాయలను తీసుకుని నీటిలో కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిలో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి తగినంత ఉప్పు, అర టీ స్పూన్ పసుపు వేసి మెత్తగా అయ్యే వరకు బాగా ఉడికించుకోవాలి.

పాన్ లో ఆయిల్ చేసి అది వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసిన పచ్చిమిర్చి, కరివేపాకు ఆకులు వాటిని బాగా వేయించాలి. ఇవి రంగు మారే వరకు స్టవ్ మీదే ఉంచి బాగా వేగించాలి అప్పుడే ఇది రుచిగా ఉంటుంది.

ముందుగా పక్కన పెట్టుకున్న ఉడికించిన కందనకాయ ముక్కలను వేసి, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి గరిటెతో మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి.

మూత పెట్టి మీడియం మంటపై ముక్కలు బాగా వేగే వరకు 15 నిముషాలు బాగా వేయించాలి. చివర్లో దించే ముందు కొత్తిమీర చల్లుకోవాలి. ఈ ఫ్రైని చాలా ఈజీగా తయారు చేయవచ్చు. ఇది వేడి వేడి అన్నం, చపాతీలోకి రుచిగా ఉంటుంది.