Kalojeraa Benefits: చెడు కొలెస్ట్రాల్, కొవ్వును తొలగిస్తుంది.. ఆరోగ్యానికి ఓ వరం నల్ల జీలకర్ర..
భారతీయుల వంట ఇల్లే ఒక ఔషధాల గని. అందులో జీలకర్ర ఒక ఔషధం. ప్రతి ఇంట్లోనూ దాదాపు ఉపయోగిస్తారు. అయితే జీలకర్ర బదులు నల్ల జీలకర్ర వలన మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆయుర్వేదంలో నల్ల జీలకర్రకు అద్భుతమైన మూలికగా పిలువబడుతుంది. వీటిని కలోంజీ విత్తనాలు అని కూడా అంటారు. నల్ల జీలకర్రలో చాలా ఫైబర్, విటమిన్లు, ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలు, కొవ్వు ఆమ్లాలు, ఇతర పోషకాలు ఉన్నాయి.