జ్యూసీ మటన్ ఫ్రై: నోట్లో వేస్తే కరిగిపోయేలా, అదిరిపోయే రుచితో ఇలా ట్రై చేయండి!

Updated on: Jun 27, 2026 | 8:27 PM

ఆదివారం వస్తే చాలు ఇళ్లల్లో నాన్‌వెజ్ ఘుమఘుమలాడాల్సిందే. చికెన్ ఎంత కామన్‌గా చేసుకున్నా, మటన్ ముక్క నోట్లోకి వెళ్తే వచ్చే ఆ తృప్తే వేరు. కానీ చాలామందికి మటన్ వండేటప్పుడు ముక్క గట్టిగా రబ్బర్‌లా అయిపోతుంటుంది. ఇంకొందరికి మసాలాలు ముక్కకు సరిగ్గా పట్టవు. పప్పుచారు, సాంబార్‌ వంటి వాటిల్లో నంచుకోవడానికే కాకుండా, వేడివేడి అన్నంలో కలుపుకుని తినడానికి కూడా ఎంతో జ్యూసీగా, సాఫ్ట్‌గా ఉండే మటన్ ఫ్రై ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీని రుచి చూశారంటే ఒక్క ముక్క కూడా వదలకుండా ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.

1 / 5
ముందుగా అరకిలో బోన్‌లెస్ మటన్ ముక్కలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. మనం మార్కెట్ నుండి మటన్ తెచ్చుకునేటప్పుడే ఎముకలతో కలిపి తెచ్చుకుని, అందులోని బోన్‌లెస్ ముక్కలను విడిగా ఫ్రై కోసం, ఎముకల ముక్కలను కూర కోసం వాడుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు కుక్కర్‌లో ఈ బోన్‌లెస్ మటన్ ముక్కలు వేసి, ఒకీ స్పూన్ ఉప్పు, పావు టీస్పూన్ పసుపు, ఒక టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి.

2 / 5
మటన్ ఉడకడానికి సరిపడా నీళ్లు పోయాలి. మటన్ నుండి కూడా నీరు ఊరుతుంది కాబట్టి, చిన్న టీ గ్లాసుతో (సుమారు 100 ఎంఎల్) నీళ్లు పోస్తే సరిపోతుంది. కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌పై మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. దీనివల్ల మటన్ దాదాపు 90 శాతం మెత్తగా ఉడికిపోతుంది.

3 / 5
మటన్ ఉడికేలోపు ప్రత్యేకమైన మసాలా పొడిని సిద్ధం చేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి మూడు టేబుల్ స్పూన్ల ధనియాలు, ఒక టీస్పూన్ జీలకర్ర, ఒక టీస్పూన్ సోంపు, చిన్న దాల్చినచెక్క ముక్క, నాలుగైదు లవంగాలు, ఐదు యాలకులు, రెండు అనాసపు రేకులు, కొద్దిగా జాపత్రి వేయాలి. మంటను లో ఫ్లేమ్‌లో ఉంచి రెండు, మూడు నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి. నాన్‌వెజ్ వేపుళ్లలో కొద్దిగా జాపత్రి వేస్తే సువాసన అద్భుతంగా ఉంటుంది. ఇవి చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తని పౌడర్‌లా గ్రైండ్ చేసి మూతపెట్టి పక్కన ఉంచాలి.

4 / 5
ఇప్పుడు వేరొక కడాయిలో ఏడు నుండి ఎనిమిది టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయాలి. నూనె కాగాక రెండు మీడియం సైజు సన్నని ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు, అర టీస్పూన్ ఉప్పు వేసి వేయించాలి. ఉల్లిపాయలు బంగారు రంగులోకి వచ్చాక, ఒక టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు స్పూన్ పసుపు వేసి పచ్చివాసన పోయేవరకు వేయించాలి. ఆ తర్వాత మూడు టేబుల్ స్పూన్ల కారం వేసి అర నిమిషం వేయించి, ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ ముక్కలను ఆ నీళ్లతో సహా కడాయిలో వేసేయాలి.

5 / 5
నీళ్లన్నీ ఇగిరిపోయి కూర దగ్గరపడే వరకు లో ఫ్లేమ్‌లో మూతపెట్టి ఉడికించాలి. అడుగు పట్టకుండా మధ్యమధ్యలో కలుపుతుండాలి. కూర పూర్తిగా దగ్గరపడ్డాక మనం తయారుచేసుకున్న మసాలా పొడిని చల్లి ఒక నిమిషం పాటు బాగా వేయించాలి. చివరగా ఈ ఫ్రై రుచిని మరింత పెంచడానికి, వేరే చిన్న గరిటెలో కొద్దిగా నెయ్యి వేసి పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు క్రిస్పీగా అయ్యేవరకు వేయించి, ఆ పోపును మటన్ ఫ్రైలో కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, ఎంతో జ్యూసీగా ఉండే స్పైసీ మటన్ ఫ్రై సిద్ధం. దీనిని అన్నం, రోటీ లేదా చపాతీల్లోకి తింటే అమృతంలా ఉంటుంది.

Follow Us