
కిడ్నీలో రాళ్ళు : కిడ్నీలో స్టోన్స్ ఉన్నవారు సపోటాను దూరం పెట్టాలి. ఎందుకంటే వీటిలో ఉండే ఫైబర్ మనుషులకి లేని పోనీ సమస్యలను తెస్తుంది. కాబట్టి, వీళ్ళు ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది.

జీర్ణక్రియ, మలబద్ధకం వంటి సమస్యలతో బాధ పడేవారు సపోటాని తింటే కడుపులో ఇబ్బంది కలిగించే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, వీళ్ళు ఎక్కువగా తీసుకోకపోవడమే మంచిది.

మనలో కొందరికి సపోటా తిన్న వెంటనే దురద, చర్మంపై దద్దుర్లు, అలెర్జి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇంకా వీరిలో ఇన్ఫెక్షన్లు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి వాళ్ళు సపోటాను ఎక్కువగా తినకండి.

బరువు పెరగడం : బరువు తగ్గాలనుకునే వారు సపోటాను అస్సలు తినకూడదు. తింటే బరువు పెరుగుతారు. కాబట్టి, వాళ్ళు ఈ పండును తినకపోవడమే మంచిది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)