రోజూ నిమ్మకాయ నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా..? అసలు నిజాలు తెలుసుకోండి..

Updated on: Jan 19, 2026 | 6:57 AM

నిమ్మకాయ.. మన వంటింట్లో సులభంగా దొరికే అద్భుత ఔషధం. విటమిన్-సి, పొటాషియం, ఫ్లేవనాయిడ్లకు నిలయమైన నిమ్మరసాన్ని రోజూ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అందరికీ తెలిసిందే. అయితే దీనిని ఎంతకాలం తాగాలి..? ఎప్పుడు తాగితే మంచిది..? ఆయుర్వేదం ఏం చెబుతోంది? వంటి ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
జీర్ణక్రియకు - బరువు తగ్గడం: యలో ఉండే ఆమ్ల రసం వాత, కఫ దోషాలను తొలగిస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. ఇది జీర్ణశక్తిని పెంచడమే కాకుండా శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపుతుంది. ముఖ్యంగా ఊబకాయం తగ్గాలనుకునే వారు 15 నుండి 21 రోజుల పాటు నిరంతరం నిమ్మరసం తీసుకోవడం వల్ల జీవక్రియ మెరుగుపడి మంచి ఫలితాలు కనిపిస్తాయి.

2 / 5
నెల రోజులు తాగితే: సాధారణ ఆరోగ్య ప్రయోజనాల కోసం 20-30 రోజుల పాటు నిరంతరం నిమ్మరసం తీసుకోవచ్చు. అయితే ఆయుర్వేద నిపుణుల ప్రకారం.. ఒక నెల పాటు వరుసగా నిమ్మరసం తాగిన తర్వాత, కనీసం ఒక వారం పాటు విరామం ఇవ్వడం మంచిది. ఇలా చేయడం వల్ల శరీరం సహజ సమతుల్యతను కాపాడుకుంటుంది.

3 / 5
రోజూ ఎంత తాగాలి? ఎలా తాగాలి?: శాస్త్రీయ కోణంలో చూస్తే నిమ్మరసం చాలా ఆరోగ్యకరమైన డ్రింక్. కానీ దీనిని పరిమితంగా తీసుకోవడమే క్షేమకరం. రోజుకు ఒక గ్లాసు నీటిలో సగం నిమ్మకాయను పిండుకుని తాగడం ఉత్తమం. గోరువెచ్చని నీటిని తీసుకుని, అందులో నిమ్మరసం కలిపి తాగాలి. రుచి కోసం కొద్దిగా తేనె కూడా కలుపుకోవచ్చు. ఉదయం ఖాళీ కడుపుతో లేదా భోజనానికి 30 నిమిషాల ముందు తీసుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు లభిస్తాయి.

4 / 5
ప్రయోజనాలు అనేకం: ఇందులోని యాంటీఆక్సిడెంట్లు ఇమ్యూనిటీని పెంచుతాయి. చర్మానికి సహజమైన మెరుపును ఇస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. శరీరంలో నీటి లోపాన్ని నివారిస్తుంది.

5 / 5
జాగ్రత్తలు తప్పనిసరి: అయితే గ్యాస్ లేదా అధిక ఆమ్లత్వ సమస్యలు ఉన్నవారు నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే దీనిని వాడాలి. నిమ్మలోని యాసిడ్ వల్ల దంతాలు జివ్వుమనే అవకాశం ఉంటుంది. అలాంటి వారు దీనికి దూరంగా ఉండటం లేదా స్ట్రా ఉపయోగించి తాగడం మంచిది. ఎటువంటి ఇబ్బందులు కలగకూడదనుకుంటే వారానికి 4 రోజులు మాత్రమే నిమ్మరసం తీసుకునేలా ప్లాన్ చేసుకోవచ్చు.