Darkened armpits: మెడ, మోకాళ్లు, మోచేతులపై నలుపు పోవాలంటే ఈ చిట్కాలు పాటించండి..

|

Nov 09, 2023 | 7:35 PM

చాలా మందికి ముఖం, మెడ, మోచేయి, మోకాళ్లపై నల్లటి మచ్చలు ఏర్పడి ఇబ్బందికరంగా ఉంటుంది. ముఖ్యంగా మోచేతులు, మోకాళ్లపై నల్ల మచ్చలు ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటాయి. అలాగే స్నానం సరిగ్గా చేయకపోయినా చంకల్లో చెమట వల్ల నల్లగా మారి దుర్వాసన వస్తుంటుంది. ఫలితంగా స్లీవ్‌లెస్‌ బ్లౌజ్ వేసుకోవాలంటే యువతులు ఇబ్బంది పడుతుంటారు. చంకలు, మోకాళ్లు, మోచేతులపై నల్లటి మచ్చలు కూడా అపరిశుభ్రతకు..

1 / 5
చాలా మందికి ముఖం, మెడ, మోచేయి, మోకాళ్లపై నల్లటి మచ్చలు ఏర్పడి ఇబ్బందికరంగా ఉంటుంది. ముఖ్యంగా మోచేతులు, మోకాళ్లపై నల్ల మచ్చలు ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటాయి. అలాగే స్నానం సరిగ్గా చేయకపోయినా చంకల్లో చెమట వల్ల నల్లగా మారి దుర్వాసన వస్తుంటుంది. ఫలితంగా స్లీవ్‌లెస్‌ బ్లౌజ్ వేసుకోవాలంటే యువతులు ఇబ్బంది పడుతుంటారు.

2 / 5
చంకలు, మోకాళ్లు, మోచేతులపై నల్లటి మచ్చలు కూడా అపరిశుభ్రతకు సంకేతాలు. ఈ మచ్చల వల్ల అనేక రకాల ఇతర చర్మ వ్యాధులు కూడా సంభవిస్తాయి. తరచుగా పబ్లిక్‌లో తిరిగే వారికి ఈ డార్క్ స్పాట్స్ ఇబ్బందికరంగా ఉంటాయి. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే ఇలా చేయండి..

3 / 5
యాపిల్ సైడర్ వెనిగర్ మచ్చలను తొలగించడానికి చాలా బాగా పనిచేస్తుంది. బియ్యం పొడి, యాపిల్ సైడర్ వెనిగర్, కొద్దిగా తేనె కలిపి ప్యాక్‌లా తయారు చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని నల్లటి మచ్చపై అప్లై చేసి 15 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత నీళ్లతో శుభ్రం చేసుకుంటే సరి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే మచ్చలు క్రమంగా తగ్గుముఖం పడతాయి.

4 / 5
తేనె, చక్కెర, కొబ్బరి నూనె, కొద్దిగా వెనిగర్ తీసుకుని ప్యాక్‌లా తయారు చేసుకుని డార్క్ స్పాట్‌లపై అప్లై చేయాలి. చంకలు, మోకాళ్లపై రాసి 10 నిమిషాల తర్వాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. వరుసగా 10 రోజులు ఈ ప్యాక్‌ ఉపయోగిస్తే ఫలితం ఉంటుంది.

5 / 5
ఒక చెంచా బియ్యం పిండి, సోర్ క్రీం బాగా కలుపుకోవాలి. ఈ క్రీమ్ ను తయారు చేసి వారానికి రెండు సార్లు నల్లని మచ్చలపై మసాజ్ చేస్తే మచ్చలన్నీ తొలగిపోతాయి. దీన్ని మోకాళ్లు, మోచేతులపై అప్లై చేసి 5-7 నిమిషాల పాటు అలాగే ఉంచుకుని గోరువెచ్చని నీళ్లతో కడగాలి. ఇది చిట్కా చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది