Womens Day: మన దేశంలో చరిత్ర సృష్టించిన అత్యంత ప్రతిభావంతులైన వీరనారీమణులు

| Edited By: Anil kumar poka

Mar 07, 2022 | 1:22 PM

Womens Day 2022: ప్రతి ఏడాది మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటాము. ఈ వేడుక ముఖ్య లక్ష్యం మహిళల హక్కులను ప్రోత్సహించడం. మహిళా దినోత్సవం సందర్భంగా మన దేశంలోని అత్యంత ప్రతిభావంతులైన వీరనారీమణులు.. తమ తమ రంగాల్లో మొదటి మొదటిసారిగా అడుగు పెట్టినవారి గురించి తెల్సుకుందాం

1 / 10
ఢిల్లీ యూనివర్సిటీ నుంచి సోషియాలజీలో మాస్టర్స్ పూర్తి చేసిన అంజలి గుప్తా.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో కోర్టు మార్టియల్ చేసిన మొట్ట మొదటి మహిళగా రికార్డ్ సృష్టించారు. తొలిసారిగా 2021 లో బెల్గామ్ లో విధుల్లో జాయిన్ అయ్యారు.  ఆమె బెంగళూరులోని ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్స్ అండ్ టెస్టింగ్ ఎస్టాబ్లిష్‌మెంట్‌లో పని చేశారు.

2 / 10
మహిళలు బయటకు రావడమే తప్పుగా చూసే సమయంలో ఏకంగా ఆటో డ్రైవర్ గా మారారు షీలా దావ్రే. మహారాష్ట్రలోని పూణెకు చెందిన షీలా దేశంలోనే మొట్టమొదటి మహిళా ఆటోడ్రైవర్ గా రికార్డ్ సృష్టించారు.

3 / 10
తెలుగమ్మాయి మిథాలి రాజ్ భారతదేశపు మహిళా క్రికెట్ క్రీడాకారిణి. మిథాలి రాజ్ క్రికెట్లో కెప్టెన్ గానే కాదు.. టెస్టు క్రికెట్లో తొలిసారి డబుల్ సెంచరీ చేసిన మహిళగా కొత్త రికార్డు నెలకొల్పారు.

4 / 10
భారతీయ అందాల సుందరిగా ప్రపంచ వ్యాప్తంగా మొట్టమొదటిసారిగా గుర్తింపు పొందారు రీటా ఫరియా. డాక్టర్, మోడల్ అయిన రీటా ఫరియా 1996లో మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న మొట్టమొదటి భారత మహిళా, ఆసియా మహిళగా రికార్డు  నెలకొల్పారు. అంతేకాదు ఓ వైద్యురాలు మిస్ వరల్డ్ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించారు.

5 / 10
కల్పనా చావ్లా 1997 లో అంతరిక్ష యానం చేసిన మొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు. అప్పుడు 376 గంటల పాటు అంతరిక్షంలో గడిపారు. భూమి చుట్టూ 252 సార్లు పరిభ్రమించి, 6.5 మిలియన్ మైళ్ళు అంతరిక్ష యానం చేశారు

6 / 10
కిరణ్ బేడీ భారతదేశపు మొట్టమొదటి ఐ.పి.ఎస్.అధికారిణి. 1972లో మహిళాఎం IPSలో చేరి తొలి మహిళా అధికారిణిగా రికార్డ్ నెలకొల్పారు. కిరణ్ బేడీ పోలీసు శాఖలో అనేక పదవులు చేపట్టి, అనేక సంస్కరణలు చేపట్టి, మెగసెసె అవార్డుతో సహా పలు అవార్డులను పొందినది. బ్యూరో అఫ్ పోలీస్ రీసెర్చి అండ్ డెవెలప్‌మెంట్ డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తూ డిసెంబర్ 2007లో స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకొంది.2003లో ఐక్యరాజ్య సమితికి సివిల్ పోలీస్ సలహాదారుగా నియమించబడ్డారు. ఇందులో తొలి మహిళగా కిరణ్ బేడీనే నిలిచారు.

7 / 10
మనదేశంలో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మొదటి మహిళగా రికార్డ్ సృష్టించారు అరుణిమా సిన్హ. ఓ ప్రమాదంలో కాలు కోల్పోయిన అరుణిమా కృతిమ కాలుతో ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించడం మరో విశేషం

8 / 10
ఇందిరా ప్రియదర్శిని గాంధీ భారతదేశపు మొట్టమొదటి.. ఏకైక మహిళా ప్రధానమంత్రి. ప్రధానమంత్రిగా ఇందిరా గాంధీ తనదైన పాలనలో చెరగని ముద్ర వేశారు. 1966 నుండి 1977 వరకు వరుసగా 3 పర్యాయాలు, 1980లో 4వ పర్యాయం ప్రధానమంత్రిగా పనిచేశారు. ఇందిరా సేవలకు గాను భారత ప్రభుత్వం 1971లో భారతరత్న అవార్డును అందజేసింది. దీంతో భారత రత్న అవార్డు అందుకున్న తొలి భారత మహిళగానూ ఇందిరా గాంధీ మరో రికార్డ్ ను సొంతం చేసుకున్నారు.

9 / 10
ఇంగ్లీస్ ఛానెల్ లో ఈత కొట్టిన తొలి భారత మహిళగానే కాదు ఆసియా మహిళగా 1959లో రికార్డ్ సృష్టించారు ఆర్తి సాహా. 1960 లో కేంద్ర ప్రభుతం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది

10 / 10
భారతదేశంలో వైద్యురాలిగా పట్టా తీసుకున్న మొట్టమొదటి మహిళగా ఆనందీబాయి గోపాల్ జోషి రికార్డ్ సృష్టించారు. 1887లో మన దేశంలో మొదటి మహిళా వైద్యురాలు. అంతేకాదు అమెరికాలో అడుగుపెట్టిన తొలి హిందూ మహిళ కూడా ఆనందీబాయి గోపాల్ రావ్ జోషి ఖ్యాతిగాంచారు