Cycling Tracks in India: మీకు సైక్లింగ్ అంటే ఇష్టమా.. ఈ ప్రదేశాల్లో ప్రయాణించడం ఓ అందమైన అనుభూతి..

Updated on: Jun 03, 2025 | 5:41 PM

ప్రతి సంవత్సరం జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా 'ప్రపంచ సైకిల్ దినోత్సవం' జరుపుకుంటారు. సైక్లింగ్ చేయడం వలన కాలుష్యం ఇబ్బంది ఉండదు. శరీరాన్ని ఫిట్‌గా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. కనుక ఈ రోజు సైక్లింగ్ ఒక విభిన్నమైన వినోదాన్ని అందించే భారతదేశంలోని 5 అందమైన సైక్లింగ్ మార్గాలు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

1 / 7
ప్రతి సంవత్సరం జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా 'ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని' జరుపుకుంటారు. సైక్లింగ్ మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. స్నేహితులతో సైకిల్ తొక్కిన ఆ చిన్ననాటి క్షణాలను తిరిగి పొందాలనుకుంటున్నారా.. లేదా అవకాశం దొరికితే నేటికీ సైక్లింగ్‌కు వెళ్లడానికి ఆసక్తి ఉన్నవారి వారిలో మీరు కూడా ఒకరా.. అది వారపు రోజు అయినా లేదా వారాంతం అయినా.. అందమైన దృశ్యాలను చూస్తూ సైక్లింగ్  థ్రిల్లింగ్ అనుభవాన్ని ఆస్వాదించగల కొన్ని అందమైన మార్గాలు భారతదేశంలో మీ కోసం ఉన్నాయి. సైక్లింగ్ అంటే ఇష్టపడేవారిని ఆహ్వానిస్తున్నాయి.

ప్రతి సంవత్సరం జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా 'ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని' జరుపుకుంటారు. సైక్లింగ్ మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. స్నేహితులతో సైకిల్ తొక్కిన ఆ చిన్ననాటి క్షణాలను తిరిగి పొందాలనుకుంటున్నారా.. లేదా అవకాశం దొరికితే నేటికీ సైక్లింగ్‌కు వెళ్లడానికి ఆసక్తి ఉన్నవారి వారిలో మీరు కూడా ఒకరా.. అది వారపు రోజు అయినా లేదా వారాంతం అయినా.. అందమైన దృశ్యాలను చూస్తూ సైక్లింగ్ థ్రిల్లింగ్ అనుభవాన్ని ఆస్వాదించగల కొన్ని అందమైన మార్గాలు భారతదేశంలో మీ కోసం ఉన్నాయి. సైక్లింగ్ అంటే ఇష్టపడేవారిని ఆహ్వానిస్తున్నాయి.

2 / 7
చాలా మంది తమ శరీరాలను ఫిట్‌గా ఉంచుకోవడానికి సైకిళ్ళు తొక్కుతారు. అయితే సైక్లింగ్ చేయడం ఇష్టమైన వారు సాధారణ రోడ్లకు బదులుగా.. భారతదేశంలోని కొన్ని అందమైన సైక్లింగ్ మార్గాల్లో కూడా సైకిల్ తొక్కవచ్చు. అది కూడా ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ సైక్లింగ్ చేయవచ్చు. భారతదేశంలో ఉన్న అందమైన సైక్లింగ్ మార్గాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..

చాలా మంది తమ శరీరాలను ఫిట్‌గా ఉంచుకోవడానికి సైకిళ్ళు తొక్కుతారు. అయితే సైక్లింగ్ చేయడం ఇష్టమైన వారు సాధారణ రోడ్లకు బదులుగా.. భారతదేశంలోని కొన్ని అందమైన సైక్లింగ్ మార్గాల్లో కూడా సైకిల్ తొక్కవచ్చు. అది కూడా ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ సైక్లింగ్ చేయవచ్చు. భారతదేశంలో ఉన్న అందమైన సైక్లింగ్ మార్గాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..

3 / 7

చెన్నై నుంచి పాండిచ్చేరి వరకు
సైక్లింగ్ అంటే ఇష్టమైన వారు చెన్నై నుంచి పాండిచ్చేరి  వరకూ సుమారు 165 కి.మీ మార్గంలో సైకిల్ మీద ప్రయాణించవచ్చు. ఈ మార్గం అంతా ప్రకృతి సౌందర్యంతో నిండి ఉంటుంది. చెన్నై నుంచి సైకిల్ ద్వారా పుదుచ్చేరికి బయలుదేరితే.. కోవలం బీచ్ , మహాబలిపురం ద్వారా పుదుచ్చేరి చేరుకుంటారు. ఈ సైకిల్ మార్గంలో చాలా అందమైన దేవాలయాలు, ప్రసిద్ధ లైట్‌హౌస్‌లను చూడవచ్చు. ఇక్కడ సైకిల్ మార్గంలో బీచ్‌లు , సముద్రాలను చూడవచ్చు. ఈ ప్రయాణం మీ మనసును దోచుకుంటుంది. సైకిల్ ద్వారా చెన్నై నుంచి 2-3 రోజుల్లో పుదుచ్చేరి చేరుకోవచ్చు.

చెన్నై నుంచి పాండిచ్చేరి వరకు సైక్లింగ్ అంటే ఇష్టమైన వారు చెన్నై నుంచి పాండిచ్చేరి వరకూ సుమారు 165 కి.మీ మార్గంలో సైకిల్ మీద ప్రయాణించవచ్చు. ఈ మార్గం అంతా ప్రకృతి సౌందర్యంతో నిండి ఉంటుంది. చెన్నై నుంచి సైకిల్ ద్వారా పుదుచ్చేరికి బయలుదేరితే.. కోవలం బీచ్ , మహాబలిపురం ద్వారా పుదుచ్చేరి చేరుకుంటారు. ఈ సైకిల్ మార్గంలో చాలా అందమైన దేవాలయాలు, ప్రసిద్ధ లైట్‌హౌస్‌లను చూడవచ్చు. ఇక్కడ సైకిల్ మార్గంలో బీచ్‌లు , సముద్రాలను చూడవచ్చు. ఈ ప్రయాణం మీ మనసును దోచుకుంటుంది. సైకిల్ ద్వారా చెన్నై నుంచి 2-3 రోజుల్లో పుదుచ్చేరి చేరుకోవచ్చు.

4 / 7
కొచ్చి నుంచి అలెప్పి వరకు
కేరళ అందాలను మరింత దగ్గరగా చూడాలనుకుంటే..  ఉదయం కొచ్చి నుంచి సైక్లింగ్ ప్రారంభించి.. సముద్ర తీరం,  బ్యాక్ వాటర్స్ వెంబడి సైకిల్ ద్వారా అల్లెప్పి చేరుకోవచ్చు. అల్లెప్పి కొచ్చి నుంచి దాదాపు 53 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ మొత్తం మార్గంలో  చిన్న గ్రామాలు, చుట్టూ పచ్చదనం, కొబ్బరి చెట్ల అందాలను వీక్షిస్తూ ప్రయాణాన్ని ఎంజాయ్ చేయవచ్చు.

కొచ్చి నుంచి అలెప్పి వరకు కేరళ అందాలను మరింత దగ్గరగా చూడాలనుకుంటే.. ఉదయం కొచ్చి నుంచి సైక్లింగ్ ప్రారంభించి.. సముద్ర తీరం, బ్యాక్ వాటర్స్ వెంబడి సైకిల్ ద్వారా అల్లెప్పి చేరుకోవచ్చు. అల్లెప్పి కొచ్చి నుంచి దాదాపు 53 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ మొత్తం మార్గంలో చిన్న గ్రామాలు, చుట్టూ పచ్చదనం, కొబ్బరి చెట్ల అందాలను వీక్షిస్తూ ప్రయాణాన్ని ఎంజాయ్ చేయవచ్చు.

5 / 7
డార్జిలింగ్ నుంచి గ్యాంగ్‌టక్
సిక్కింలో మీరు సులభంగా సైకిల్ తొక్కగలిగే అందమైన సైకిల్ మార్గాలు చాలా ఉన్నాయి. గాంగ్‌టక్ డార్జిలింగ్ నుంచి 100 కి.మీ దూరంలో ఉంది. ఈ మార్గంలో సైక్లింగ్ చేయడం వేరే రకమైన సరదా. ఇక్కడ మీరు దారిలో అనేక పర్వతాలు, టీ తోటలు, రకరకల్ మఠాలు చూడవచ్చు.

డార్జిలింగ్ నుంచి గ్యాంగ్‌టక్ సిక్కింలో మీరు సులభంగా సైకిల్ తొక్కగలిగే అందమైన సైకిల్ మార్గాలు చాలా ఉన్నాయి. గాంగ్‌టక్ డార్జిలింగ్ నుంచి 100 కి.మీ దూరంలో ఉంది. ఈ మార్గంలో సైక్లింగ్ చేయడం వేరే రకమైన సరదా. ఇక్కడ మీరు దారిలో అనేక పర్వతాలు, టీ తోటలు, రకరకల్ మఠాలు చూడవచ్చు.

6 / 7
పూణే నుంచి పంచషేట్ ఆనకట్టకు ప్రయాణం
ఇక్కడి ప్రయాణం 100 కిలోమీటర్లు. ఈ మార్గంలో ముతా నది నీలం, ఆకుపచ్చ నీటిని కూడా చూడవచ్చు, ఇది నిజంగా చాలా అందంగా ఉంటుంది. అంతేకాదు దారిలో ఆగి సింహగఢ్ కోటను కూడా సందర్శించవచ్చు. కోట చేరుకోవడం కొంచెం కష్టమే అయినప్పటికీ అక్కడికి చేరుకున్న తర్వాత.. ఇక్కడి దృశ్యాలను చూసి మీ హృదయం సంతోషంగా ఉంటుంది.

పూణే నుంచి పంచషేట్ ఆనకట్టకు ప్రయాణం ఇక్కడి ప్రయాణం 100 కిలోమీటర్లు. ఈ మార్గంలో ముతా నది నీలం, ఆకుపచ్చ నీటిని కూడా చూడవచ్చు, ఇది నిజంగా చాలా అందంగా ఉంటుంది. అంతేకాదు దారిలో ఆగి సింహగఢ్ కోటను కూడా సందర్శించవచ్చు. కోట చేరుకోవడం కొంచెం కష్టమే అయినప్పటికీ అక్కడికి చేరుకున్న తర్వాత.. ఇక్కడి దృశ్యాలను చూసి మీ హృదయం సంతోషంగా ఉంటుంది.

7 / 7
లేహ్ నుంచి ఖర్దుంగ్
లేహ్ నుండి ఖర్దుంగ్ వరకు దూరం కేవలం 40 కిలోమీటర్లు. అయితే ఈ మార్గంలో సైక్లింగ్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఈ మార్గంలో ప్రయాణం చేయడానికి 2 రోజులు పట్టవచ్చు. ఇది ప్రపంచంలోనే అత్యంత కష్టతరమైన సైక్లింగ్ మార్గం. కానీ అత్యంత అందమైన సైక్లింగ్ మార్గం.

లేహ్ నుంచి ఖర్దుంగ్ లేహ్ నుండి ఖర్దుంగ్ వరకు దూరం కేవలం 40 కిలోమీటర్లు. అయితే ఈ మార్గంలో సైక్లింగ్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఈ మార్గంలో ప్రయాణం చేయడానికి 2 రోజులు పట్టవచ్చు. ఇది ప్రపంచంలోనే అత్యంత కష్టతరమైన సైక్లింగ్ మార్గం. కానీ అత్యంత అందమైన సైక్లింగ్ మార్గం.