Indian Tourism: ఆగస్టులో ఆహ్లాదాన్ని ఇచ్చే అద్భుత పర్యాటక ప్రదేశాలు.. ఎక్కడో కాదు మన దేశంలోనే..

|

Jul 29, 2023 | 4:54 PM

August Tour: ఆగస్టు నెల వాతావరణం చల్లగా, మనసును హత్తుకునేలా ఉంటుంది. ఈ సమయంలో మన బిజీ లైఫ్‌కి కొంత బ్రేక్ ఇచ్చి దేశంలోని కొన్ని ప్రదేశాలను సందర్శించడం వల్ల అన్ని రకాల ఒత్తిడి, ఆందోళనల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. ఈ నేపథ్యంలో ఆగస్టులో సందర్శించదగిన ప్రదేశాలు మన దేశంలో ఏమున్నాయో ఇప్పుడు చూద్దాం..

1 / 5
హైదరాబాద్: మీరు మీ బిజీ లైఫ్‌కి కొంత బ్రేక్ ఇచ్చి తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ని సందర్శించవచ్చు. హైదరాబాదీ లైఫ్ స్టైల్ మీకు ఎంతో నచ్చుతుంది. ముఖ్యంగా హైదరాబాదీ బిర్యానీని ఒక్క సారి రుచి చూస్తే జీవితంలో మళ్లీ మరచిపోలేరు. ఇంకా ఈ భాగ్యనగరంలో మీరు చార్మినార్, రామోజీ ఫిల్మ్ సిటీ, హుస్సేన్ సాగర్‌ లేక్‌లోని బుద్ధ విగ్రహం, ట్యాంక్ బండ్, గోల్కొండ కోట, సాలార్ జంగ్ మ్యూజియం, బిర్లా టెంపుల్, బిర్లా మ్యూజియం, ఎన్‌టీఆర్ గార్డెన్స్ వంటి అనేక ప్రదేశాలను సందర్శించవచ్చు.

2 / 5
ఢిల్లీ: ఆగస్టు నెల ఢిల్లీని సందర్శించడం చాలా ఉత్తమం. ఇక్కడ నుంచి కావాలంటే మీరు రాజస్థాన్‌లోని జైపూర్, ఉదయపూర్ ట్రిప్‌కి కూడా వెళ్లవచ్చు. దేశరాజధానిలో మీరు నహర్‌ఘర్ కోట, సిటీ ప్యాలెస్, లేక్ పిచోలా, ఎర్రకోట, కుతుబ్ మినార్, ఇండియా గేట్, లోటస్ టెంపుల్, జామా మసీద్, అక్షరధామ్ ఆలయం, నేషనల్ మ్యూజియం, జంతర్ మంతర్ అబ్జర్వేటరీ వంటి ప్రదేశాలను కూడా సందర్శించగలరు.

3 / 5
ముంబై: దేశ వాణిజ్య రాజధాని ముంబై నగరం ఆగస్టు నెలలో సందర్శించడం ఎంతో హాయినిస్తుంది. ఇక్కడి బీచ్ అందాలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. ఇంకా ఇక్కడ ఉండే సిటీ కల్చర్, నైట్ లైఫ్ మీకు ఎంతో నచ్చుతాయి. అలాగే రుచికరమైన ఫుచ్ మీ నాలుకకు కూడా ఎంతో నచ్చేస్తుంది. ఇక్కడ మీరు గేట్‌వే ఆఫ్ ఇండియా, సంజయ్ గాంధీ నేషనల్ పార్క్, సిద్ధివినాయక ఆలయం, నెహ్రూ ప్లానిటోరియం, వీరమాత జీజాబాయి భోసలే జూ, ఛత్రపతి శివాజీ మహారాజ్ వాస్తు సంగ్రహాలయ, తాజ్ హోటల్ వంటి పలు ప్రదేశాలను వెళ్లవచ్చు.

4 / 5
బెంగుళూరు: టెక్ ఉద్యోగులతో నిండిపోయిన బెంగళూరులో కూడా ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ప్రకృతి అందాలు, ఆహ్లాదకరమైన వాతావరణం మిమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ఇక్కడ మీరు బెంగళూరు ప్యాలెస్, లాల్‌బాగ్ బొటానికల్ గార్డెన్, కబ్బన్ పార్క్, విధాన సౌధ, అనేక హిల్ స్టేషన్లు, ఉల్సూర్ సరస్సు, ఇస్కాన్ టెంపుల్‌ను కూడా సందర్శించవచ్చు.

5 / 5
కోల్‌కతా: ఆగస్టు నెలలో కోల్‌కతా ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. మీ పర్యటనలో భాగంగా కలకత్తా నగరంలో మీరు హౌరా బ్రిడ్జ్, ఈడెన్ గార్డెన్స్ స్టేడియం, విక్టోరియా మెమోరియల్ హాల్, నేతాజీ భవన్, ఠాగూర్ హౌస్ వంటి పలు ప్రదేశాలను సందర్శించవచ్చు. ముఖ్యంగా కలకత్తా కాళీ మాతను మీరు దర్శించవచ్చు.