
నిజానికి నవంబర్ నెలలో ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాలు మంచుతో కప్పబడి ధవళవర్ణంతో కనుల విందు చేస్తాయి. నవంబర్‌లో నెలలో కొన్ని ప్రదేశాల అందం మరింత పెరుగుతుంది. ఈ ప్రాంతాలను సందర్శించడానికి ప్రధాని మోడీ కూడా వెళ్లేందుకు ఇష్టపడతారు. ఆ దేశాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..

కార్గిల్ , లడఖ్: గతేడాది దీపావళి పర్వదినాన్ని ప్రధాని మోడీ లడఖ్‌లోని కార్గిల్ లో జరుపుకున్నారు. సైనికులతో కలిసి దీపావళి జరుపుకోవడానికి ప్రధాని ప్రతి సంవత్సరం ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారు. అయితే ప్రధాని మోడీ పర్వతప్రాంతాలకు వెళ్లేందుకు ఇష్టపడతారు. కార్గిల్ చల్లని ప్రాంతం. నవంబర్ నెలలో ఇక్కడి వాతావరణం మరింత అద్భుతంగా ఉంటుంది. చలి పెరగకముందే ఈ నెలలోనే ఇక్కడికి విహారయాత్ర మంచి అనుభూతినిస్తుంది.

జగేశ్వర్ ధామ్, అల్మోరా : ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలను ప్రధాని మోడీ తరచుగా సందర్శిస్తుంటారు. ఇటీవల ప్రధాన మంత్రి ఉత్తరాఖండ్‌లోని అల్మోరాలో ఉన్న జగేశ్వర్ ధామ్‌ని సందర్శించారు కూడా. కేదార్‌నాథ్ , బద్రీనాథ్ లాగానే ఈ ధామ్ కూడా ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఉత్తరాఖండ్‌లోని ఈ ధామ్, హిల్ స్టేషన్‌లకు కంచుకోట, చుట్టూ ప్రకృతి అందాలు కనువిందు చేస్తాయి. ఇక్కడ చూడదగిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. విశేషమేమిటంటే నవంబర్‌లో ఇక్కడి ప్రకృతి అందాలు మరింత పెరుగుతాయి.

ప్రధాని మోడీ ఉత్తరాఖండ్ పర్యటన సందర్భంగా పితోరాఘర్ లోని పార్వతి కుండ్‌కు ని సందర్శిస్తారు. ఉత్తరాఖండ్‌లో సందర్శించడానికి ఇది గొప్ప ప్రదేశం అని ప్రధాని అభివర్ణించారు. ఇక్కడికి చేరుకోవాలంటే ముందుగా పితోరాఘర్ కు చేరుకోవాలి. అక్కడ నుంచి పార్వతి కుండ్‌కి బస్సు లేదా టాక్సీ ద్వారా చేరుకోవాలి. ఇక్కడికి చేరుకోవడానికి దాదాపు 4 లేదా 5 గంటలు పట్టవచ్చు. ఈ ప్రదేశం సముద్ర మట్టానికి దాదాపు 5000 అడుగుల ఎత్తులో ఉంది. ఇక్కడ ఎత్తైన పర్వతాలు, నీలి ఆకాశం వంటి అందమైన దృశ్యాలు ఆకర్షణీయంగా ఉంటాయి.

నవంబర్‌లో మీరు మనాలి, సిమ్లా వంటి ప్రాంతాలకు వెళ్లవచ్చు. ఎందుకంటే డిసెంబర్‌లో ఇక్కడ మంచు కురుస్తుంది. అటువంటి పరిస్థితిలో ప్రయాణం కష్టం అవుతుంది. అంతేకాదు నవంబర్‌లో ఈశాన్య భారతదేశాన్ని సందర్శించడం కూడా మంచి అనుభూతినిస్తుంది. రుతుపవనాల తర్వాత, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు పచ్చదనంతో మరింత అందంగా కనిపిస్తాయి. సిక్కిం , నాగాలాండ్ సందర్శించడానికి నవంబర్ ఉత్తమ నెల.