
లెంగ్‌పుయ్ విమానాశ్రయం: లెంగ్‌పుయ్ విమానాశ్రయం మిజోరంలో ఉన్న చాలా అందమైన విమానాశ్రయం ఇది. ఈ ఎయిర్‌పోర్ట్ దాని అందానికి చాలా ప్రసిద్ధి చెందింది. ఈ విమానాశ్రయానికి సమీపంలో పెద్ద పర్వతాలు, పచ్చదనం అందరిని ఆకట్టుకుంటుంది.

గగ్గల్ విమానాశ్రయం: హిమాలయ పర్వత శ్రేణుల ఒడిలో ఉన్న గగ్గల్ విమానాశ్రయం భారతదేశంలోని అందమైన విమానాశ్రయాలలో ఒకటి. ఈ విమానాశ్రయం ధర్మశాల నుండి 14 కిలోమీటర్ల దూరంలో 2525 అడుగుల ఎత్తులో ఉంది. ఈ విమానాశ్రయం అందాలను చూస్తుంటే మిగతా ప్రదేశాలన్నీ మర్చిపోతారు.

వీర్ సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం, పోర్ట్ బ్లెయిర్: ఇది అండమాన్ -నికోబార్ దీవుల్లో ప్రధాన విమానాశ్రయం. ఇది దాని రాజధాని పోర్ట్ బ్లెయిర్‌లో ఉంది. దీనిని పోర్ట్ బ్లెయిర్ విమానాశ్రయం అని కూడా అంటారు. ఈ విమానాశ్రయం చుట్టూ చాలా పచ్చదనం ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఇక్కడ అందరిని ఆకట్టుకునేలా ఉంటుంది.

కుషోక్ బకులా రిన్‌పోచే విమానాశ్రయం, లడఖ్: ఇది ప్రపంచంలోని ఎత్తైన విమానాశ్రయాలలో ఒకటి. ఇది సుమారు 3256 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ విమానాశ్రయం నుండి చుట్టుపక్కల ప్రదేశాలు చాలా అందంగా ఉంటాయి. చూపురులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఈ విమానాశ్రయం దాని అందమైన దృశ్యాల కారణంగా పర్యాటకులలో చాలా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతం చుట్టూ ఉన్న మంచుతో కప్పబడిన పర్వతాల అందమైన దృశ్యాలను మీరు చూడవచ్చు.

దబోలిమ్ విమానాశ్రయం, గోవా: ఈ విమానాశ్రయాన్ని గోవా అంతర్జాతీయ విమానాశ్రయం అని కూడా అంటారు. ఈ విమానాశ్రయం దబోలిమ్ గ్రామంలో ఉంది. ఈ విమానాశ్రయం సముద్ర తీరంలో ఉంది. దాని స్థానం కారణంగా ఇది భారతదేశంలోని అందమైన విమానాశ్రయాలలో ఒకటిగా పరిగణిస్తారు.