Capsicum Benefits: క్యాప్సికంతో ఈ దీర్ఘకాలిక వ్యాధులకు చెక్..! ఎన్ని లాభాలంటే?

|

Aug 24, 2024 | 3:43 PM

క్యాప్సికం తినాలంటే.. చాలా మంది ఇష్టపడరు.. కానీ, క్యాప్సికం తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు పోషకాహార నిపుణులు. దీంతో శరీరానికి అనేక రకాల పోషకాలు లభిస్తాయని చెబుతున్నారు. శరీరానికి అవసరమయ్యే విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు అధిక మోతాదులో లభిస్తాయి. అంతేకాదు..ఇందులో విటమిన్ సి కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి దీర్ఘకాలిక వ్యాధుల వారిన పడకుండా శరీరాన్ని రక్షించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. క్యాప్సికమ్‌ తినటం వల్ల కలిగే మరిన్ని లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
క్యాప్సికమ్ లో విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఐరన్ లోపాన్ని తగ్గిస్తుంది. రక్తహీనతను కూడా నిరోధిస్తుంది. బరువు తగ్గడానికి క్యాప్సికమ్ చక్కగా ఉపయోగపడుతుంది. క్యాప్సికమ్ లో
ఉబకాయాన్ని కరిగించే పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. క్యాప్సికంలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది.

క్యాప్సికమ్ లో విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఐరన్ లోపాన్ని తగ్గిస్తుంది. రక్తహీనతను కూడా నిరోధిస్తుంది. బరువు తగ్గడానికి క్యాప్సికమ్ చక్కగా ఉపయోగపడుతుంది. క్యాప్సికమ్ లో ఉబకాయాన్ని కరిగించే పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. క్యాప్సికంలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది.

2 / 5
కంటి ఆరోగ్యానికి క్యాప్సికమ్ ఎక్కువగా పనిచేస్తుంది. క్యాప్సికమ్ లో  లుటిన్, జియాక్సంతిన్ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. క్యాప్సికంలో ఉంటే బీటా కెరోటిన్ కళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిది. కంటి చూపును మెరుగుపరచడమే కాకుండా అన్ని రకాల కంటి సమస్యలను తగ్గించేందుకు ఎంతగానో సహాయపడుతుంది. దీంతోపాటు రే చీకటి వంటి సమస్యలు రాకుండా చేస్తుంది.

3 / 5
క్యాప్సికం కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలోనూ కీలకపాత్ర పోషిస్తుంది.  గుండె జబ్బులతో పాటు ఇతర సమస్యలతో బాధపడుతున్న వారు క్రమం తప్పకుండా క్యాప్సికం తమ ఆహారంలో చేర్చుకోవాలని చెబుతున్నారు. 
క్యాప్సికంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాపాడతాయి. చర్మంపై ముడతలు, మచ్చలు ఏర్పడకుండా శరీరాన్ని రక్షిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

క్యాప్సికం కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలోనూ కీలకపాత్ర పోషిస్తుంది. గుండె జబ్బులతో పాటు ఇతర సమస్యలతో బాధపడుతున్న వారు క్రమం తప్పకుండా క్యాప్సికం తమ ఆహారంలో చేర్చుకోవాలని చెబుతున్నారు. క్యాప్సికంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాపాడతాయి. చర్మంపై ముడతలు, మచ్చలు ఏర్పడకుండా శరీరాన్ని రక్షిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

4 / 5
క్యాప్సికమ్‏లో క్యాప్సైసిన్ అనే పోషకం ఉంటుంది.  ఇది చర్మాన్ని అనేక సమస్యల నుంచి రక్షిస్తుంది. క్యాప్సికమ్ చర్మ ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుస్తుంది. క్యాప్సికమ్ లో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి ఫంగల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ను నివారించడంలో సూపర్ గా  సహాయపడుతాయి.

5 / 5
క్యాప్సికం లో ఉండే గుణాలు కీళ్ల నొప్పులను నియంత్రించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఇందులో ఉండే క్యాప్సైసిన్ యూరిక్ యాసిడ్ ను నియంత్రించేందుకు ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాకుండా అనేక రకాల సమస్యలను తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది.