
ఉసిరికాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది శరీర ఇమ్యూనిటీ పవర్ ను పెంచడమే కాకుండా అలసట, నీరసాన్ని కూడా తగ్గించి రోజంతా ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండేందుకు ఇది చాలా సహాయపడుతుంది. పుల్ల పుల్లగా కారంగా ఉండే ఈ ఉసిరికాయ పప్పు వేడి వేడి అన్నంలో తింటే ఏ మాంసం కూరలు కూడా సరిపోవు.

టేస్టీ ఉసిరికాయ పప్పుకు కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు కందిపప్పు, అర కప్పు ఉసిరికాయ ముక్కలు, ఒక చిన్న ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి , ఒక పెద్ద టమాటా, పావు టీ స్పూన్ పసుపు , ఒక టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, చింతపండు, రెండు టేబుల్ స్పూన్స్ నూనె, అర టేబుల్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర , 5 వెల్లుల్లి రెబ్బలు, రెండు ఎండుమిర్చి, కరివేపాకును తీసుకోవాలి.

కందిపప్పు - ఉసిరికాయ : ముందుగా కందిపప్పును రెండు సార్లు బాగా కడిగి వాటిని కుక్కర్‌లో వేసి కొద్దిగా ఉడికిన తరవాత దానిలో పచ్చిమిర్చి, టమాటాలు , పసుపు వేసిఉడికించాలి. వీటితో పాటు ఉసిరికాయల ముక్కలను కూడా వేసి 5 నిముషాలు పాటు స్టవ్ మీదే ఉంచాలి. అయితే, దీనిలో వేసే ముందు పాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసి ఉసిరికాయ ముక్కలు రంగు మారే వరకు వేయించాలి.

ఉసిరికాయ ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉంచి దానిలో రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం, చింతపండు కూడా 10 నిమిషాల పాటు బాగా మరిగించాలి. ఇంకా మరో పాన్‌లో తాలింపు వేసి దీనిలో కలుపుకోవాలి. చివరగా నెయ్యి కొద్దిగా వేసి వేడి అన్నంతో తినాలి.

ఉసిరికాయ పప్పు తినడం వలన ఎన్నో లాభాలు ఉన్నాయి. వారం కనీసం ఒకసారైనా తింటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఇంకా శరీరానికి విటమిన్ సి కూడా అందిస్తుంది. ఇంకా జీర్ణక్రియపనితీరు కూడా మెరుగుపడుతుంది. నీరసం తగ్గి రోజంతా చాలా యాక్టివ్‌గా ఉంటారు. చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.