
ఈ మధ్య కాలంలో హ్యాకర్లు పెట్రేగి పోతున్నారు. జనాల్ని ఒకింత హడలెత్తిస్తున్నారు. ఫోన్లను హ్యాక్ చేసి.. అకౌంట్స్ ఉండే డబ్బును తెలివిగా కాజేస్తున్నారు. ప్రస్తుత కాలంలో హ్యాకర్ల బెడద బాగా ఎక్కువైపోయింది. సాధారణ ప్రజల సోషల్ మీడియా అకౌంట్సే కాకుండా.. సెలబ్రిటీల అకౌంట్స్‌ని కూడా హ్యాక్ చేస్తున్నారు.

కాబట్టి హ్యాకర్లతో చాలా జాగ్రత్త వహించాలి. మీ మొబైల్‌లో ఈ మధ్య ఈ మార్పులు కనిపిస్తే..వెంటనే అలెర్ట్ అవ్వండి. మీ ఫోన్ హ్యాక్ అయ్యిందో లేదో ఇలా కనిపెట్టవచ్చు. మీ ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోతుంటే మీ ఫోన్ వేరొకరి కంట్రోల్‌లో ఉన్నట్టే.

అదే విధంగా మీ మొబైల్ ఎక్కువగా వేడి అవుతున్నా కూడా అనుమానించాల్సిందే. ఎందుకంటే ఫోన్ ఎక్కువగా యూజ్ చేస్తే.. వేడి అవుతుంది. మీ ఫోన్‌లో మీకు తెలియకుండా అప్లికేషన్స్ రన్ అవుతూ ఉంటాయి.

అలాగే సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి మీరు పోస్ట్ చేయకుండా.. ఎలాంటి పోస్ట్ అయినా.. మీ ఫోన్ హ్యాక్ అయిందని గుర్తు పెట్టుకోండి. మీ ఫోన్ ఉన్నట్టుండి స్లో అయినా కూడా అది హ్యాకర్ల పనే.

వెంటనే మీ ఫోన్ మొత్తం చెక్ చేయండి. ఎలాంటి అనవసరమైన యాప్స్, మాల్వేర్స్, అప్లికేషన్స్ ఉంటే వెంటనే అన్ ఇన్స్‌స్టాల్ కొట్టిపారేయండి. అలాగే దగ్గరలోని పోలీసుల సహాయం తీసుకోండి.