
కర్పూరాన్ని ఎక్కువగా పూజల్లో ఉపయోగిస్తూ ఉంటారు. కర్పూరంతో కేవలం పూజలే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కర్పూరంతో చర్మ, జుట్టు సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. ఇందులో పలు రకాల ఔషధ గుణాలు ఉన్నాయి.

కర్పూరంతో కొన్ని రకాల పరిహారాలు చేస్తే ఇంటికి మంచిదని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ప్రతి రోజూ కర్పూరాన్ని ఇంట్లో వెలిగించడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి.. పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుందని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడింది.

ప్రతిరోజూ ఇంట్లో కర్పూరాన్ని వెలిగిస్తే.. చికాకులు, గొడవలు తగ్గుతాయి. ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయని జ్యోతిష్యశాస్త్రం చెబుతుంది.

ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నెలకొనడం వల్ల అన్ని పనులు సమయానికి పూర్తి అవుతాయి. ఇల్లు ఆనందంతో నిండిపోతుంది. శాంతి, శ్రేయస్సు, ఆనందం నెలకొని ఉంటాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది.

అంతే కాకుండా ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా బయట పడతారని, ఆర్థిక సమస్యలు తీరతాయని, లాబాలు చేకూరతాయని, అలాగే కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత కూడా నెలకొంటుందని జ్యోతిష్య శాస్త్రం వెల్లడిస్తుంది.