
మొలకలను కొందరు తీసి పారేస్తారు. ఇంకొందరు ఇష్టంగా తింటారు. ఎందుకంటే, వీటిని నానా బెట్టుకుని తినాలంటే కొంచం కష్టంగా భావిస్తారు. వీటిలో మన శరీరానికి కావాల్సిన ప్రోటీన్స్ ఉన్నాయి.

అయితే, ఇవి చూడడానికి చిన్నగా ఉంటాయి. కానీ, ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవి మనం ఒకసారి తినడం మొదలు పెడితే, మన శరీరంలో మార్పులను నిశ్శబ్దంగా తీసుకురాగలవు. టిఫిన్ కు బదులు మొలకలను మీ ఫుడ్ డైట్ లో చేర్చుకుంటే అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు.

మొలకల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. మీరు వీటిని ఉదయం పూట తీసుకోవడం వల్ల ఆహారం మొత్తం జీర్ణమవుతుంది. అంతేకాదు, జీర్ణక్రియ పని తీరు కూడా మెరుగుపడుతుంది. ఇంకా గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.

ఉదయం పూట టిఫిన్ కు బదులు మొలకలను తినడం వలన ఇన్పెక్షన్లు వంటి సమస్యలు తగ్గుతాయి. అంతేకాదు, అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతాము.

అధిక బరువుతో బాధపడే వారికీ మొలకలు చాలా మంచివి. ఎందుకంటే, వీటిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. అంతే కాదు, ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి, బరువు తగ్గాలనుకునే వారికీ ఇవి సూపర్ ఫుడ్.