
కొత్త కొత్త రకాల ఫ్రూట్స్ ఇప్పుడు మార్కెట్లోకి వెళ్తున్నాయి. అలా ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అవుతున్న పండ్లలో ఈ గ్యాక్ ఫ్రూట్ కూడా ఒకటి. దీన్నే అడవి కాకర అని కూడా తెలుగులో పిలుస్తున్నారు. ఈ మధ్య కాలంలో వీటికి బాగా డిమాండ్ పెరిగింది.

ఈ పండ్లు ఆరెంజ్, ఎరుపు రంగులో ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. ఈ పండు ఎక్కువగా ఆస్ట్రేలియా, థాయ్ లాండ్, మలేషియం, వియత్నాం వంటి దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఇండియాలో కూడా లభిస్తుంది. ఈ పండు పుచ్చకాయ జాతికి చెందినది. ఈ పండులో అనేక రకాల పోషకాలు ఉన్నాయి,.

పోషకాల పుట్టగా ఈ పండును పేర్కొంటున్నారు. ఈ పండు తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ఈ పండు ఖరీదు కూడా ఎక్కువే. గ్యాక్ ఫ్రూట్ తినడం వల్ల వృద్ధాప్యం త్వరగా దరి చేరదు. ఇందులో విటమిన్లు, మినరల్స్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మోతాదులో లభిస్తాయి.

ఈ పండును పలు రకాల ట్యాబ్లెట్ల తయారీలో కూడా ఉపయోగిస్తున్నారు. ఈ పండు దాదాపు అరకిలో నుంచి కిలో బరువు ఉంటుంది. ఈ పండుతో సూప్‌లు, కూరలు కూడా తయారు చేసుకోవచ్చు. ఇది తీగ జాతికి చెందిన మొక్క.

క్యాన్సర్ ఉన్నవారు ఈ పండు తింటే త్వరగా కోలుకుంటారు. శరీరంలో క్యాన్సర్ కణాలను కూడా పెరగకుండా అడ్డుకుంటుంది. దెబ్బ తిన్న కణాలను కూడా రిపేర్ చేస్తుంది. కంటి సమస్యలు, జీర్ణ సమస్యలు, గుండె పోటు సమస్యలు రాకుండా ఉంటాయి. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)