
ఈ మధ్య కాలంలో చాలా మంది చిన్న వయసులోనే పెద్ద వయసు ఉన్న వారిలా కనిపిస్తున్నారు. ఇందుకు ముఖ్య కారణం మీరు తీసుకునే ఆహారమే. అనేక రకాల పానీయాలు, ఆహారాలు తినడం వల్ల త్వరగా వృద్ధాప్య ఛాయలు వచ్చేస్తాయి. దీని వలన చిన్న వయసులోనే ముసలి వారిలా కనిపిస్తారు.

ఆల్కహాల్ పానీయా తక్కువ పోషకాలు, ఎక్కువ కేలరీలను కలిగి ఉంటాయి. దీనితో పాటు, చిప్స్ ఇతర రుచికరమైన స్నాక్స్ తీసుకోవడం వల్ల మొత్తం కేలరీల సంఖ్య పెరుగుతుంది.

సాఫ్ట్ డ్రింక్స్ కూడా ఎక్కువగా తాగినా చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఇవి తాగినా కూడా వృద్ధాప్య ఛాయలు వచ్చేస్తాయి. కాబట్టి వీటికి కూడా దూరంగా ఉండటం మేలు. కాపీ, టీలు ఎక్కువగా తాగేవారు కూడా ముసలి వారిలా కనిపిస్తారు. ఇందుకు కారణం కెఫిన్, పంచదార.

కార్బోనేటేడ్ పానీయాలు పోషకాహారం లేనివి. ఇందులో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇందులో సోడా ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది.

ఎక్కడ పడితే అక్కడ దొరికే డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, జంక్ ఫుడ్స్ వంటివి తిన్నా వయసు పెరిగిన వారిలా కనిపిస్తారు. చర్మ ఆరోగ్యం దెబ్బతిని, ముడతలు పడి, ముఖంలో గ్లో అనేది చాలా వరకు తగ్గిపోతుంది. కాబట్టి రుచిగా ఉన్నాయని తినేయకండి.