
ప్రస్తుత కాలంలో ఎంతో మంది కిడ్నీ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసులోనే ఎంతో మంది కిడ్నీల ఇన్ఫెక్షన్లతో బాధ పడుతున్నారు. అనారోగ్యకరమైన ఆహారం తినడం వల్ల, లైఫ్ స్టైల్ విధానం కారణంగా చాలా మంది కిడ్నీ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.

కిడ్నీలు పాడైపోవడం ఆ ఎఫెక్ట్ మొత్తం శరీరంపై పడుతుంది. ఆహారాన్ని ఫిల్టర్ చేసి.. మలినాలను బయటకు పంపించడంలో మూత్ర పిండాలు ఎంతో చక్కగా పని చేస్తాయి. మూత్ర పిండాలు ఆరోగ్యంగా పని చేయాలంటే నీరు మాత్రమే తాగితే సరిపోదు.

కిడ్నీలు పాడైపోతే ప్రాణాలికే ప్రమాదం. అందుకే ఎప్పటికప్పుడు వ్యాధి లక్షణాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. కిడ్నీల ఇన్ఫెక్షన్‌కు గురైనా, పాడైన శరీరంలో ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.

ఉదయం పూట వికారంగా ఉండటం, తరచూ వాంతులు అవడం, నూరగతో కూడిన మూత్రం రావడం, మూత్రం వెంట రక్తం కారడం, వెన్ను నొప్పి తీవ్రంగా రావడం, పొత్తి కడుపులో నొప్పి తీవ్రంగా తరచూ వస్తే మాత్రం వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి.

అంతే కాకుండా కళ్లు తిరగడం, కళ్ల చుట్టూ, కాళ్ల చుట్టూ వాపులు కనిపించడం కూడా కిడ్నీల సమస్యలు రావడానికి ముందు కనిపించే లక్షణాల్లో ఇవి కూడా ఉంటాయి. కాబట్టి కిడ్నీలు ఆరోగ్యంగా పని చేయాలంటే.. పెరుగు, కొత్తిమీర, పసుపు, బెర్రీస్, గుమ్మడి గింజలు వంటివి తీసుకోవాలి. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)