
అన్ని దానాలకంటే అన్నదానం మిన్న అని అంటూ ఉంటారు. ఎంత మందికి అన్నదానం చేస్తే అంత మంచిదని పెద్దలు చెబుతూ ఉంటారు. వీలైనప్పుడు, చేతనైనప్పుడల్లా లేని వారికి అన్నాన్ని దానంగా చేస్తే చాలా మంచిదట. అలాగే మనుషులకే కాకుండా చీమలకు కూడా ఆహారాన్ని అందిస్తే ఎన్నో మంచిదట.

బియ్యం పిండిలో చక్కెర లేదా బెల్లాన్ని కలిపి పెడితే ఎంతో మంచి కలుగుదంట. ఆహారాన్ని తిన్న చీమలు మీకు జయం కాలగాలని, విజయం లభించాలని దీవిస్తాయట. లేదంటే చీమలకు వట్టి పంచదార అయినా పెట్టినా మంచిదే.

అలాగే మీరు పూజ చేసిన అనంతరం ఓ ఆకులో వేసి పక్కన పెట్టి వదిలేస్తే వాటిని చీమలు ఆహారంగా తీసుకుంటాయి. దీని వల్ల మీకు చాలా మంచి ఫలితం వస్తుంది. అదే విధంగా తేనెను చీమలకు పెడితే దోషాలన్నీ పోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

దానాలు చేయడం వల్ల దరిద్రం నుంచి బయట పడతాయి. దానం ఏమీ చేయడానికి లేనప్పుడు తోటకూర చేసినా పుణ్యమేనట. కాబట్టి మీకు తోచినంత సహాయం, దానం చేస్తూ ఉండండి.

చీమలకు ప్రతి రోజూ ఆహారాన్ని అందిస్తే.. 10 వేల మందికి అన్నదానం చేసిన పుణ్యం కలుగుతుందట. మనుషులు తిరిగే చోట కాకుండా.. చీమలకు ప్రత్యేకమైన చోటును ఏర్పాటు చేసి అక్కడ చీమలకు ఆహారాన్ని అందించండి. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.