1 / 11
అధిక రక్తపోటు లేదా హై బీపీ మన శరీరానికి చాలా హాని కలిగిస్తుంది. ముఖ్యంగా కళ్ళకు రక్తాన్ని సరఫరా చేసే చిన్న, సున్నితమైన రక్త నాళాలను దెబ్బతీస్తుంది. హై బీపీ రెటీనాలోని రక్తనాళాలను దెబ్బతీస్తుంది, ఇది చూపు కల్పించే కంటి వెనుక భాగం. ఈ కంటి వ్యాధిని హైపర్‌టెన్సివ్ రెటినోపతి అంటారు. అధిక రక్తపోటుకు చికిత్స చేయకుండా వదిలేస్తే, నష్టం తీవ్రంగా ఉంటుంది.