
రక్తంలో చక్కెరను నియంత్రించుకోవడానికి డయాబెటిక్ రోగులు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. చక్కెరను పెంచే ఆహారాలు, చక్కెర పానీయాలకు దూరంగా ఉండాలి. వారు ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. సమయానికి నిద్రపోవాలి. వారు సమయానికి మందులు తీసుకోవాలి. ప్రతిరోజూ రక్తంలో చక్కెరను పర్యవేక్షించాలి. డయాబెటిక్ రోగులు ఎల్లప్పుడూ తమ బరువును నియంత్రణలో ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. వారు ఎప్పటికప్పుడు వైద్యుడిని సంప్రదిస్తూ ఉండాలి.

తేనెని తీసుకుంటే మెటబాలిజం పెరుగుతుంది. దీని వల్ల జీర్ణశక్తి సరిగ్గా పెరిగి మనం తీసుకున్న ఆహారాన్ని బాడీ సరిగ్గా అబ్జార్బ్ చేసుకుంటుంది. దీంతో పోషకాలు అందుతాయి. బరువు కూడా తగ్గుతారు. తేనె తీసుకోవడం వల్ల అధిక క్యాలరీలు కలిగిన స్వీట్లపై కోరికలు తగ్గుతాయి. తేనెలో ఉండే కార్బోహైడ్రేట్లు త్వరిత శక్తిని అందజేస్తాయి.

ప్రతిరోజూ గోరు వెచ్చని నీటిలో తేనె వేసుకోవాలి. జీవక్రియను మెరుగ్గా చేసేందుకు తేనెని ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకోవచ్చు. దీనిని తీసుకోవడం వల్ల ఆకలి, ఎక్కువగా తినాలన్న కోరికలను తగ్గిస్తుంది. ఇది కేలరీలు తీసుకోకుండా చూస్తుంది.

తేనె తీసుకోవడం మధుమేహం రోగులకు ఏ విధంగానూ ప్రయోజనకరం కాదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.. తేనెలో చక్కెర కంటే ఎక్కువ కార్బోహైడ్రేట్లు, కేలరీలు, తీపి ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరను వేగంగా పెంచుతుంది. ప్రత్యేకత ఏమిటంటే తేనెను చక్కెరకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించలేము.

honey