Stomach Pain: మీకూ భోజనం తిన్న వెంటనే కడుపు నొప్పి వస్తుందా? ఈ పొరబాట్లు చేస్తున్నట్లే..

|

Nov 07, 2024 | 12:55 PM

చాలా మందికి భోజనం చేసిన వెంటనే కడుపు నొప్పి ప్రారంభమవుతుంది. ఇలా ఎందుకు జరుగుతుందో తెలియక నానా తంటాలు పడుతుంటారు. కానీ మీరు చేసే చిన్న పొరబాటు వల్ల ఇలా జరుగుతుందని అంటున్నారు నిపుణులు..

1 / 5
నేటి జీవనశైలి, ఆహారం అలవాట్ల కారణంగా పలురకాల ఆరోగ్య సమస్యలు దాడిచేస్తున్నాయి. ముఖ్యంగా అల్పాహారం తీసుకున్న మొదలు నిద్రపోయే వరకు మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు మన ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. కొందరికి భోజనం చేసిన వెంటనే కడుపునొప్పి వస్తుంది. కొంచెం తిన్నా కూడా ఎక్కువ తిన్నట్లు అనిపిస్తుంది.

2 / 5
కడుపులో అల్సర్, థైరాయిడ్, గుండెల్లో మంట, మలబద్ధకం, ఒత్తిడి కారణంగా ఏదైనా తిన్న తర్వాత కూడా కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తిన్న వెంటనే కడుపునొప్పి రాకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.

3 / 5
ఆహారం జీర్ణం కావడానికి నీరు అవసరం. కానీ చాలా మంది అవసరమైన దానికంటే తక్కువ నీరు తాగుతారు. దీని వల్ల శరీరంలో నీటి లోపం ఏర్పడి తిన్న ఆహారం సరిగా జీర్ణం కాదు. ఇది కడుపులో నొప్పి లేదా తిమ్మిరి అనుభూతిని కలిగిస్తుంది. కాబట్టి, భోజనం తర్వాత, రోజూలో అధికంగా నీరు త్రాగే అలవాటును పెంచుకోవాలి.

4 / 5
చాలా మంది భోజనం చేసిన వెంటనే మంచం మీద పడుకుంటారు. పడుకున్నప్పుడు కడుపులోని ఆమ్లం వెనుకకు, పైకి కదులుతుంది. తిన్న వెంటనే పడుకునే అలవాటు వల్ల కడుపు నొప్పి, తిమ్మిర్లు వస్తాయి. అలాగే కొంతమంది అతిగా తింటారు. ఒకేసారి ఎక్కువ ఆహారం తీసుకోవడం వల్ల కడుపు నొప్పి వస్తుంది. అలాగే పేలవమైన జీర్ణక్రియ కడుపు నొప్పికి కారణం కావచ్చు. కాబట్టి నెమ్మదిగా జీర్ణమయ్యే, అసిడిక్ ఫుడ్, బ్రెడ్, స్పైసీ ఫుడ్ జీర్ణమవడం కష్టమైన ఆహారాన్ని వీలైనంత తగ్గించడం మంచిది.

5 / 5
పండ్ల రసం, ప్రాసెస్ చేసిన చీజ్ వంటి ఆమ్ల ఆహారాలు తీసుకోవడం కూడా కడుపు నొప్పికి కారణం అవుతాయి. అలాగే భోజనం చేసిన వెంటనే స్వీట్స్ తీసుకోవడం తగ్గించాలి. ఇలా చేయడం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. తిన్న తర్వాత కడుపునొప్పి రాకుండా ఉండాలంటే కాసేపు నడవడం అలవాటు చేసుకోవాలి. రాత్రి భోజనం చేసిన తర్వాత కనీసం అరగంటైనా నడవాలని నిపుణులు చెబుతున్నారు. ఇది కడుపు సంబంధిత సమస్యలను నివారిస్తుంది.