
కావాల్సిన పదార్ధాలు : 4 బంగాళాదుంపలు, 4 గుడ్లు, ఉల్లిపాయ 1, 4 పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు , రుచికి తగినంత ఉప్పు , అర టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్స్ నూనెను తీసుకోవాలి.

ముందుగా పాన్ లో ఆయిల్ వేసి దానిలో కట్ చేసిన బంగాళాదుంప ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి బాగా వేయించాలి. ఆ తర్వాత దానిలో అర టీ స్పూన్ పసుపు, ఉప్పు, అర టీ స్పూన్ కారం కూడా మిక్స్ అయ్యేలా కలుపుకోండి.

ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దానిలో కొద్దిగా ఉప్పు, కారం, పసుపు వేసి దానిలో గుడ్లను బ్రేక్ చేసి కొట్టి దానిలో వేయండి.

ఇప్పుడు ముందుగా పక్కన పెట్టుకున్న బంగాళాదుంప మిశ్రమాన్ని, గుడ్డులో వేసి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. పాన్లో ఆయిల్ వేసి ఈ మిశ్రమాన్ని ఆమ్లెట్ లా పోయాలి.

మీడియం మంట మీద పెట్టి ఒక వైపు బంగారు కలర్ లోకి మారిన తర్వాత రెండో వైపు కూడా తిప్పి ఆమ్లెట్ ను బాగా వేయించుకోవాలి. అంతే, వేడి వేడి బంగాళాదుంప ఆమ్లెట్ రెడీ.