పచ్చి మిర్చీతో అదిరిపోయే స్వీట్.. తింటే వావ్ అనాల్సిందే!

Updated on: Jul 27, 2025 | 7:23 PM

చాలా మంది రకరకాల స్వీట్స్ తయారు చేస్తుంటారు. కానీ పచ్చిమిర్చితో స్వీట్ చేయడం చాలా తక్కువ మందికి తెలుసు. అంతే కాకుండా, చాలా మంది పచ్చి మిర్చితో స్వీట్ ఏంటీ? దీంతో స్వీట్స్ కూడా తయారు చేస్తారా? అవి చాలా కారంగా ఉంటాయి, వీటితో స్వీట్ ఏంటీ? అని ఆశ్చర్యపోతుంటారు.

1 / 5
చాలా మంది రకరకాల స్వీట్స్ తయారు చేస్తుంటారు. కానీ పచ్చిమిర్చితో స్వీట్ చేయడం చాలా తక్కువ మందికి తెలుసు. అంతే కాకుండా, చాలా మంది పచ్చి మిర్చితో స్వీట్ ఏంటీ? దీంతో స్వీట్స్ కూడా తయారు చేస్తారా? అవి చాలా కారంగా ఉంటాయి, వీటితో స్వీట్ ఏంటీ? అని ఆశ్చర్యపోతుంటారు. కానీ తెలియని విషయం ఏమిటంటే? పచ్చి మిరపకాయలతో స్వీట్ మంచి టేస్ట్ ఉంటుందంట. కాగా, మీరు కూడా ఈ స్వీట్ తయారు చేయాలి అనుకుంటున్నారా.. ? పదండి రెడీ చేద్దాం.

2 / 5
పచ్చిమిర్చీ స్వీట్‌కు కావాల్సిన పదార్థాలు : పచ్చిమిర్చి 10 నుంచి 12 వరకు తీసుకోవాలి. అయితే కాస్త తక్కువ కారం, లావుగా ఉన్న వాటిని స్వీట్ తయారీ కి తీసుకోవడం ఉత్తమం. అలాగే పాలకోవా, ఒక కప్పు, చక్కెర ఒక కప్పు, నీరు ½ కప్పు,నెయ్యి 2 టీ స్పూన్స్, తరిగిన డ్రై ఫ్రూట్స్, 2 టీస్పూన్స్, యాలకుల పొడి, వన్ టీస్పూన్.

3 / 5
తయారు చేసే విధానంలోకి వెళ్లితే.. ముందుగా పచ్చిమిర్చీని తీసుకొని వాటిని నీటితో శుభ్రం చేసుకోవాలి. తర్వాత అందులోని గింజలు తీసి వేసి వేడి నీటిలో రెండు నిమిషాలపాటు ఉడకబెట్టి, తర్వాత వాటిని చల్లటి నీటిలో వేసి, పక్కన పెట్టుకోవాలి.

4 / 5
 తర్వాత మరొక పాన్ తీసుకొని అందులో రెండు టీస్పూన్స్ నెయ్యి, వేసి దానిని కాస్త వేడి చేయాలి. తర్వాత నెయ్యి వేడి అయ్యాక, పాలకోవ వేసుకొని అది బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత ఈ మిశ్రమంల కాస్త చక్కెర, డ్రైఫ్రూట్స్, యాలకుల పొడి వేసి ఒక నిమిషం వేయించి, గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అది చల్లగా అవుతుంది.

5 / 5
తర్వాత ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న మిరపకాయల్లో , ఈ డ్రైఫ్రూట్,కోవా మిశ్రమాన్ని నింపాలి. దీని తర్వాతన పానకం తయారు చేసుకోవాలి. దీని కోసం ఒక పాన్ తీసుకొని, అందులో ఒక కప్పు చక్కెర, ½ కప్పు నీరు వేసి తేలికపాటి పానకం వచ్చే వరకు వేడి చేయాలి. తర్వాత కోవతో నింపిన పచ్చిమిరపకాయలను ఈ చక్కర పానకంలో వేయాలి. దీనిని రెండు లేదా మూడు నిమిషాలు ఉండనివ్వాలి. అంతే మంచి రుచిని ఇచ్చే పచ్చిమిర్చీ స్వీట్ రెడీ, మరి మీరు కూడా రెడీ చేయండి.