
కావాల్సిన పదార్ధాలు : 4 వంకాయలు, 4 టమాటోలు, ఒక కప్పు బీరకాయలు, ఒక కప్పు దొండకాయ, ఒక కప్పు బెండకాయ ముక్కలు , 250 గ్రాముల పచ్చిమిర్చి, ఒక చిన్న ఉల్లిపాయ, చింతపండు రసం, వెల్లుల్లి రెబ్బలు, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఉప్పు, మూడు టేబుల్ స్పూన్స్ నూనెను తీసుకోండి.

ముందుగా స్టవ్ వెలిగించి పాన్ లో ఆయిల్ వేసి అది వేడయ్యాక దానిలో వంకాయ, బీరకాయ, దొండకాయ, బెండకాయలు ముక్కలు, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి, చింతపండు వేసి స్టవ్ మీదే 10 నిముషాల పాటు బాగా మగ్గించాలి.

ఉడికిన మిశ్రమాన్ని ఒక ప్లేట్ లోకి తీసుకుని రొటీలో కూరగాయలను అన్ని వేసి కచ్చా పచ్చా గా దంచుకోవాలి. ఆ తర్వాత మధ్యలో కొద్దిగా ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు , జీలకర్ర మెత్తగా అయ్యేలా రుబ్బుకోవాలి.

ఇక ఇప్పుడు ఇప్పుడు తాలింపు పెట్టడానికి స్టవ్ వెలిగించి పాన్ లో ఆయిల్ వేసి దానిలో పోపు గింజలు, అర టీ స్పూన్ ఆవాలు, మినుములు, 4 ఎండుమిర్చి, కరివేపాకు ఆకులు వేసి పోపు వెయ్యాలి.

అంతే, వేడి వేడి పచ్చి కూరగాయల రోటి పచ్చడి రెడీ. దీనిని తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఇష్టంగా తింటారు. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి కొద్దిగా వేసుకుని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది.