
అధిక బరువు ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది. దీనిని తగ్గించుకోవడానికి చాలా మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు వ్యాయామంతో తగ్గించుకుంటే, మరి కొందరు డైట్ ను ఫాలో అయ్యి బాడీని కంట్రోల్ చేసుకుంటారు.

టిఫిన్ చేసే ముందు ఈ బెండకాయ నీళ్ళను తాగడం వల్ల ఆకలి వెయ్యదు. అలాగే, తినడాన్ని కూడా తగ్గిస్తారు. అంతే కాదు, బ్లడ్ లో షుగర్ లెవెల్స్ కూడా అదుపులో ఉంటాయి.

అంతేకాదు, ఈ నీళ్లను భోజనానికి ముందు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. బెండకాయ నీరు వంటి అధిక ఫైబర్ ఉండే ఫుడ్స్ ను తీసుకోవడం వల్ల బరువు సులభంగా తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు.

ఒక గ్లాస్ నీళ్ళను తీసుకుని దానిలో 3 బెండకాయలను చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి. వీటిని ఇలాగే రాత్రంతా నానబెట్టాలి. కదలించకండి.

ఇక ఉదయం పూట వీటిని కలిపి టిఫిన్ కి ముందు పరగడుపున వీటిని తాగాలి. ఇంకా వీటిలో మంచి రుచి కోసం లెమన్ ను కూడా వాడొచ్చు. ఇలా మీరు రోజూ ఈ డైట్ ను ఫాలో అయితే మీరు ఎక్కడికి వెళ్లకుండానే సులభంగా బరువు తగ్గుతారు. అలాగే, మీ అందం కూడా రెట్టింపు అవుతుంది.