
కావాల్సిన పదార్ధాలు : అర కిలో ఉసిరికాయలు, రుచికి సరిపడినంత ఉప్పు, రెండు టేబుల్ స్పూన్స్ కారం, ఒక టీ స్పూన్ ఆవపొడి, అర టీ స్పూన్ మెంతి పొడి, అర టీ స్పూన్ పసుపు, రెండు టేబుల్ స్పూన్స్ నూనె, తాలింపు గింజలు తీసుకోవాలి.

ముందుగా ఉసిరికాయలను తీసుకుని వాటిని కడిగి శుభ్రంగా చేసుకోవాలి. ముఖ్యంగా, కొంచం నీరు లేకుండా వాటిని ఆరబెట్టాలి. ఇక ఇప్పుడు వాటిని తురుముకోవాలి.

ఇక ఇప్పుడు దానిలో తురిమిన ఉసిరిని వేసి కొద్దిగా ఉప్పు, అర టీ స్పూన్ పసుపు, రెండు టేబుల్ స్పూన్స్ కారం, అర టీ స్పూన్ ఆవపొడి, అర టీ స్పూన్ మెంతి పొడిని వేసి బాగా కలపాలి.

ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్‌లో ఆయిల్ వేడి చేసి, పోపు గింజలు, రెండు ఎండుమిర్చి, కరివేపాకు తాలింపు లాగా వేసుకుని కొంతసేపు చల్లారనివ్వాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తీసుకుని ఒక సీసాలో పెట్టుకుంటే ఏడాది పాటు ఎప్పుడూ కావాలంటే అప్పుడు తినొచ్చు. మీరు వెంటనే తినాలనుకుంటే రెండు రోజుల తర్వాత వేడి వేడి అన్నంలో తింటే రుచి అద్భుతంగా ఉంటుంది.