
ఉదయం లేవగానే టిఫిన్ ఏం చేసుకుని తినాలా అని రోజూ ఆలోచిస్తూ ఉంటాము. ఇక లేచి చేసుకుని కొందరికి చిరాకుగా ఉంటుంది. అయితే చాలా మంది ఇడ్లీ , దోస మాత్రమే చేయడానికి ఇష్ట పడతారు. ఎందుకంటే ఇది త్వరగా అయిపోతాయి కాబట్టి.

ఇడ్లీ, దోసెలకు కొబ్బరి చట్నీ అయితే పర్ఫెక్ట్. ఇది రుచికరంగా ఉంటుంది అలాగే మీ పనులకు ఆటంకం కలగకుండా త్వరగా అయిపోతుంది కూడా. తమిళనాడులో ఈ చట్నీ చాలా ఫేమస్. కొన్ని ప్రాంతాలలో ఇప్పుడిప్పుడే తినడం మొదలు పెట్టారు. కొబ్బరి లేకుండా కొబ్బరి చట్నీని ఎలా తయారు చేయాలో మీరేం ఎక్కువ ఆలోచించకండి. ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

కావాల్సిన పదార్దాలు: ఉల్లిపాయలు ముక్కలు, పచ్చిమిర్చి , వెల్లుల్లి రెబ్బలు, , జీడిపప్పు , చింత పండు, ఉప్పు, నూనె , ఆవాలు , జీలకర్ర చిటికెడు కొత్తిమీర , కరివేపాకు.

ముందుగా స్టవ్ వెలిగించి కొంచం నూనె వేసి వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసి రంగు మారే వరకు బాగా వేయించాలి. ఆ తర్వాత జీడిపప్పు, చింతపండు రుచికి తగినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకోండి.

ఆ తర్వాత తగినంత నీరును పోసి చట్నీని మిక్సీ లో పట్టుకోవాలి. ఆ తర్వాత దానిని ఒక బౌల్ లోకి తీసుకోవాలి. అంతే కొబ్బరి చట్నీ రెడీ. ఇలా చేసుకుని తింటే కొబ్బరి చట్నీ టేస్ట్ లాగే ఉంటుంది. మీరు కూడా ఒకసారి ప్రయత్నించి చూడండి. అవును నిజమే ఇది కొబ్బరి చట్నీ లాగే ఉందని అంటారు. దీనిని వ ఇడ్లీ, దోసతో తింటే మీకు రుచి తెలుస్తుంది.