
కావాల్సిన పదార్ధాలు : 350 గ్రాములు బోడ కాకరకాయలు, ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, 4 ఎండుమిర్చి, ఒక టీ స్పూన్ వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు ఆకులు, జీలకర్ర, రుచికి ఉప్పు, కారం, పసుపు, నూనెను తీసుకోవాలి.

బోడ కాకరకాయలను తీసుకుని నీటిలో కడిగి వాటిని ముక్కలుగా కట్ చేసి నూనెలో బాగా వేయించుకోవాలి.

ఇప్పుడు రొటీలో నాలుగు ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, కొబ్బరి ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి కచ్చా పచ్చాగా దంచుకోవాలి.

వేయించిన బోడ కాకరకాయ ముక్కలలో ఈ మిశ్రమాన్ని వేసి గరిటేతో తిప్పుకుని కరివేపాకు ఆకులు వేసి మీడియం మంటపై 10 నిమిషాల పాటు స్టవ్ మీదే పెట్టండి.

దించే ముందు వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పొయ్యాక కొత్తిమీర వేసి కిందకు దించేయండి. అంతే, వేడి వేడి బోడ కాకరకాయ కారం కూర రెడీ. వర్షాకాలం మొదలైతే చాలు.. ఇవి మనకి మార్కెటల్ దొరుకుతాయి.