
ఈ డిజిటల్ యుగంలో కూడా కొందరు ఏటీఎంలకు వెళ్లి డబ్బులు తెచ్చుకుంటుంటారు. అలా వెళ్లినప్పుడు కొన్ని సార్లు చిరిగిన నోట్లు వస్తుంటాయి. కానీ అలా వచ్చిన నోట్లను ఏం చేయాలో చాలా మందికి తెలియదు. అందుకే ఈ విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారుల ప్రయోజనం కోసం కొన్ని స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

చిరిగిన నోట్లు వస్తే ఏం చేయాలి?: ఒక వేళ మీరు ఏటీఎంకు వెళ్లినప్పుడు చిరిగిన నోట్లు వస్తే మీరు మొదట కంగారు పడకుండా.. వెంటనే ఆ ఏటీఎం ఏ బ్యాంకుకు చెందినదో చూసి.. దాన్ని బ్రాంచ్‌ను ఎక్కడుదో అక్కడికి వెళ్లి నేరుగా అధికారులను సంప్రదించండి. వారు మీకు ఏం చేయాలో అనే ప్రాసెస్ చెప్తారు.

మీ డబ్బు మీరు తిరిగి పొందాలంటే మీరు బ్యాంక్ అధికారులకు అప్లికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. బ్యాంక్‌లో దరఖాస్తు ఫామ్ తీసుకొని.. నగదు ఏ తేదీన, ఏ సమయంలో, ఏ ఏటీఎం నుంచి ఎంత మొత్తం విత్‌డ్రా చేశారనే వివరాలను ఆ ఫామ్‌లో ఫిల్ చేయాలి. ఆ అప్లికేషన్‌కు మీరు ఏటీఎంలో విత్‌డ్రా చేసిన ట్రాన్సాక్షన్ స్లిప్, లేదా మీ ఫోన్‌కు వచ్చిన ఎస్ఎమ్ఎస్ (SMS) సంబంధిన వివరాలను కూడా యాడ్ చేశారు. తర్వాత దాన్ని బ్యాంక్‌లో సమర్పించారు.

అధికారులు మీ నుంచి తీసుకున్న దరఖాస్తును పరిశీలించి ఆర్బీఐ నిబంధనల ప్రకారం మీ దగ్గర ఏవైతే నోట్ల చిరిగిపోయినవి ఉన్నాయో వాటిని తీసుకొని మీరు కొత్త నోట్లను ఇస్తుంది. అయితే ఇక్కడ కొన్ని కండీషన్స్ కూడా ఉన్నాయి. ఒక్కో వ్యక్తికి కేవలం 20 నోట్లను మాత్రమే మార్చుకోవచ్చు. అది కూడా కేవలం రూ.5వేల వరకు మాత్రమే, అంతకంటే ఎక్కువ ఉంటే దానికి మరో ప్రాసెస్ ఉంటుంది.

అయితే ఆర్‌బీఐ రూల్స్ ప్రకారమే నోట్లు మార్చి ఇవ్వడానికి కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. మీరు తెచ్చే నోటు పూర్తిగా ముక్కలైపోయినా, బాగా కాలిపోయినా, గుర్తుపట్టలేనంతగా లేదా పరీక్షించడానికి వీలులేనంతగా పూర్తిగా దెబ్బతిన్నప్పుడు వాటిని తీసుకోరు. కాబట్టి ఏటీఎం నుంచి పాడైన నోట్లు వస్తే వాటిని జాగ్రత్తగా భద్రపరిచి, వెంటనే సంబంధిత బ్యాంకును ఆశ్రయించడం ఉత్తమం. ఈ సారి ఏటీఎంలో మీకు చిరిగిన నోట్లు వస్తే కంగారు పడకుండా ఈ ట్రిక్ ఫాలో అవ్వండి.