అందాన్నిపెంచే మటన్ బుడం దోసకాయ కూర ఇలా చేస్తే.. ఆపకుండా లాగిస్తూనే ఉంటారు

Updated on: Mar 05, 2026 | 12:32 PM

బుడం దోసకాయ కూరను రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఇష్టంగా తింటారు. అయితే, వీటిని నాన్ వెజ్ కూరల్లో వేసుకుని తింటే రుచికరంగా ఉంటుంది. దీన్ని మీరు మటన్ తో చేసుకుని తింటే తింటూనే ఉంటారు. అలాంటి టేస్ట్ ఎక్కడా కూడా దొరకదు. ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం..

1 / 5
ముందుగా మటన్ తీసుకుని మూడు సార్లు శుభ్రం చేసి ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి. అలాగే బుడం దోసకాయలను కడిగి  తొక్క తీసి ముక్కలుగా  కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.

ముందుగా మటన్ తీసుకుని మూడు సార్లు శుభ్రం చేసి ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి. అలాగే బుడం దోసకాయలను కడిగి తొక్క తీసి ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.

2 / 5
ఇప్పుడు గ్యాస్ వెలిగించి పాన్ పెట్టి దానిలో రెండు స్పూన్స్  ఆయిల్ వేసి, మటన్ ముక్కలు,  నాలుగు ఎండుమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు ఆకులు, టమాటా ముక్కలు వేసి వాటిని బాగా మగ్గించాలి.

ఇప్పుడు గ్యాస్ వెలిగించి పాన్ పెట్టి దానిలో రెండు స్పూన్స్ ఆయిల్ వేసి, మటన్ ముక్కలు, నాలుగు ఎండుమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు ఆకులు, టమాటా ముక్కలు వేసి వాటిని బాగా మగ్గించాలి.

3 / 5
ఉల్లిపాయ, టమాటా ముక్కలు మగ్గిన తర్వాత ఒక టీ స్పూన్  అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసి గరిటెతో బాగా తిప్పుకోవాలి. 
ఆ తర్వాత బుడం దోసకాయ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, కారం వేసి మిక్స్ అయ్యేలా బాగా కలపాలి.

ఉల్లిపాయ, టమాటా ముక్కలు మగ్గిన తర్వాత ఒక టీ స్పూన్  అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసి గరిటెతో బాగా తిప్పుకోవాలి. ఆ తర్వాత బుడం దోసకాయ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, కారం వేసి మిక్స్ అయ్యేలా బాగా కలపాలి.

4 / 5
మటన్ ముక్కలు ఉడికిన తర్వాత దానిలో ధనియాల పొడి, మసాలా పొడి, ఒక గ్లాస్ నీళ్లు పోసి పొయ్యి మీదే ఉంచి బాగా ఉడికించాలి. 
అప్పుడే కూర రుచిగా ఉంటుంది.

మటన్ ముక్కలు ఉడికిన తర్వాత దానిలో ధనియాల పొడి, మసాలా పొడి, ఒక గ్లాస్ నీళ్లు పోసి పొయ్యి మీదే ఉంచి బాగా ఉడికించాలి. అప్పుడే కూర రుచిగా ఉంటుంది.

5 / 5
ఇప్పుడు మూత పెట్టి 10 నిముషాల పాటు ఉడికించి దించే ముందు అర  కొత్తిమీరను కట్ చేసి దానిలో వేయండి. అంతే, మటన్ బుడం దోసకాయ కూర రెడీ. దీనిని వేడి వేడి అన్నంలో తింటే చర్మ సమస్యలు పోతాయి.

ఇప్పుడు మూత పెట్టి 10 నిముషాల పాటు ఉడికించి దించే ముందు అర కొత్తిమీరను కట్ చేసి దానిలో వేయండి. అంతే, మటన్ బుడం దోసకాయ కూర రెడీ. దీనిని వేడి వేడి అన్నంలో తింటే చర్మ సమస్యలు పోతాయి.

Follow Us