
వాక్యూమ్ క్లీనర్ వాడకం: విండో స్లైడింగ్, విండో ట్రాక్‌ను శుభ్రంగా, మెరిసేలా చేయటానికి కొన్ని సాధారణ ఉపాయాలు మీకు సూపర్‌గా హెల్ప్ చేస్తాయి. ఇందుకోసం ముందుగా మీరు ట్రాక్ నుండి పొడి దుమ్ము, చెత్తను వాక్యూమ్ చేయండి. మీ వాక్యూమ్ క్లీనర్‌పై చాలా సన్నని నాజిల్ ఉంటే, మూలల నుండి దుమ్మును తొలగించడం సులభం అవుతుంది.

బేకింగ్ సోడా, వెనిగర్: మురికి చాలా జిగటగా ఉంటే దానికి కొద్దిగా బేకింగ్ సోడా వేసి పైన వెనిగర్ చల్లుకోండి. నురుగు ఏర్పడి మురికిని వదిలిస్తుంది. 5 నుండి 10 నిమిషాల తర్వాత పాత గుడ్డ లేదా బ్రష్‌తో తుడవండి.

స్పాంజితో శుభ్రం చేయండి: ఒక సాధారణ స్పాంజ్ తీసుకొని స్లైడింగ్ ట్రాక్ పై తుడవండి. స్పాంజ్‌తో ట్రాక్ ఇనుప కడ్డీలను క్లీన్ చేయటానికి పెన్‌తో మార్క్ చేసుకోండి. ఇప్పుడు కట్టర్ సాయంతో స్పాంజ్ ను మార్కుల ప్రకారం కత్తిరించుకోవాలి.. దీనివల్ల స్పాంజ్ ట్రాక్ ఆకారానికి సరిగ్గా సరిపోతుంది. ఇలా తుడిచారంటే.. అన్ని వరుసలలోని మురికి ఒకేసారి బయటకు వస్తుంది.

పెయింట్ బ్రష్, బ్రష్ వాడకం: కొన్నిసార్లు తడి గుడ్డను ఉపయోగించిన తరువాత కూడా దుమ్ము, దూళి మిగిలిపోతుంది. అలాంటప్పుడు, పొడి దుమ్మును తుడవడానికి మృదువైన ముళ్ళతో ఉండే చిన్నపాటి పెయింట్ బ్రష్‌ను ఉపయోగించండి. దీనివల్ల మూలల్లోని సన్నని దుమ్మును పూర్తిగా తొలగించడం సులభం అవుతుంది. తర్వాత ఒక మెత్తటి కాటన్ గుడ్డతో తుడిచేసుకోవాలి.

హెయిర్ డ్రైయర్: చెత్త చాలా పొడిగా ఉండి, మీ దగ్గర వాక్యూమ్ క్లీనర్ లేకపోతే, హెయిర్ డ్రైయర్ ఉపయోగించి దుమ్మును మొత్తం ఒక వైపుకు ఊదండి. తర్వాత తడి గుడ్డతో నీట్ ఎత్తేసుకోవచ్చు.

కిచెన్ లోనూ వంట పాత్రలు పెట్టుకునే స్లైడింగ్ డ్రాయర్స్ కూడా ఇలాగే క్లీన్ చేసుకోవచ్చు. ముందుగా అన్ని డ్రాయర్స్ ని బయటకు తీసి, వాటిపై మామూలు లిక్విడ్ స్ప్రే చేసి కాసేపు వదిలేయాలి. ఆ తరవాత ఓ పాత క్లాథ్ తో శుభ్రం చేయాలి.