Adulteration: మీరు వంటల్లో ఉపయోగించే కారం పొడి స్వచ్ఛమైనదేనా? కల్తీ కారంను ఇంట్లోనే ఇలా చెక్ చేసుకోవచ్చు..

|

Sep 13, 2022 | 7:58 PM

భారతీయ వంటగదుల్లో ఉపయోగించే పదార్ధాల్లో కారం ఒకటి. ఎర్రని ఎండు మిరపకాయలతో తయారు చేసిన కారం పొడిని దాదాపు అన్ని రకాల వంటల్లో ఉపయోగిస్తారు. అయితే మార్కెట్లో దొరికే కారం పొడుల్లో కల్తీ ఉంటుందని మీకు తెలుసా?..

1 / 6
భారతీయ వంటగదుల్లో ఉపయోగించే పదార్ధాల్లో కారం ఒకటి. ఎర్రని ఎండు మిరపకాయలతో తయారు చేసిన కారం పొడిని దాదాపు అన్ని రకాల వంటల్లో ఉపయోగిస్తారు. అయితే మార్కెట్లో దొరికే కారం పొడుల్లో కల్తీ ఉంటుందని మీకు తెలుసా?

2 / 6
ప్రస్తుతం మార్కెట్‌లో విక్రయిస్తున్న ఎర్ర కారం ప్యాకెట్లన్నింటిలో ఇటుక పొడి, టాల్కం పౌడర్, ఇతర విషపూరిత పదార్థాలు కలిసిపోయి ఉంటాయి. ఇటువంటి ఉత్పత్తులను కంటితో చూసి, వెంటనే కల్తీని కనుక్కోలేం. ఇటువంటి కల్తీ ఆహారాల వల్ల ఆరోగ్యానికి తీరని నష్టం వాటిల్లుతుంది.

3 / 6
అందుకే మీరు వాడుతున్న మిరప పొడి స్వచ్ఛమైనదా.. కాదా.. అనే విషయం నిర్ధారించుకోవడం చాలా అవసరం. తాజాగా FSSAI ఎర్ర కారం పొడి స్వచ్ఛతను తనిఖీ చేసే విధానం గురించి ట్విట్టర్‌లో ఒక వీడియోను షేర్‌ చేసింది.

4 / 6
కారం స్వచ్ఛతను ఇంట్లోనే తనిఖీ చేసుకోవచ్చు. సగం గ్లాసు నీరు తీసుకుని, దానిలో ఒక స్పూన్‌ కారం కలుపుకోవాలి. అనంతరం నీటిని కదిలించకుండా ఉంచాలి.

5 / 6
తర్వాత గ్లాస్‌ అడుగుభాగానికి చేరిన కారంపొడిని తీసుకుని.. అరచేతిపై మృదువుగా రుద్దాలి. చేతికి గరుకుగా అనిపిస్తే.. అందులో ఇసుక లేదా ఇటుక పొడి కలిపినట్లు అర్థం.

6 / 6
కల్తీలేని కారం పొడి సాధారణంగా నీటిలో కరిగిపోతుంది. అలా కరగలేదంటే ఆ కారం పొడిలో సబ్బు పొడి లేదా డిటర్జెంట్ పౌడర్ కలిపినట్లు అర్ధం. ఈ రకమైన కారం పొడిని ఆహారంలో అస్సలు ఉపయోగించకూడదు.